Vamsi Karumanchi : అమెరికా నుంచి వచ్చి కరోనాలో ఇరుక్కుపోయి సినిమా తీసిన నిర్మాత..

నిర్మాత వంశీ మీడియాతో మాట్లాడుతూ గం గం గణేశా సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిపారు.

Gam Gam Ganesha Producer Vamsi Karumanchi talk about Movie

Vamsi Karumanchi : ఆనంద్ దేవరకొండ(Anand Deverakonda) మే 31న గం గం గణేశా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ప్రస్తుతం మూవీ యూనిట్ అంతా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. ఈ సినిమాని ఉదయ్‌ శెట్టి ద‌ర్శ‌క‌త్వంలో హై-లైఫ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై కేదార్‌ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మించారు. తాజాగా నిర్మాత వంశీ మీడియాతో మాట్లాడుతూ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిపారు.

వంశీ కారుమంచి మాట్లాడుతూ.. మాది గుంటూరు. అమెరికా వెళ్లి జాబ్స్, బిజినెస్ చేశాం. కరోనా ముందు ఇండియాకు వచ్చాను. అనుకోకుండా కరోనా లాక్ డౌన్ రావడంతో ఇక్కడే ఉండిపోయాను. నేను ఎప్పట్నుంచో సినిమా తీద్దామనుకున్నాను. దాంతో ఇదే మంచి టైం అని కథలు విని ఈ సినిమా మొదలుపెట్టాం. అమెరికాలో కూడా కొన్ని సినిమాలు డిస్ట్రిబ్యూషన్ చేసాము. నేను బాలయ్య గారికి పెద్ద ఫ్యాన్. చిన్నపట్నుంచి సినిమాని ఫుల్ గా ఎంజాయ్ చేస్తాను. అమెరికాలో ఇంకొన్నేళ్లు ఉండి ఇండియాకు వచ్చి సెటిల్ అయి నిర్మాత అవ్వాలనుకున్నాను. కరోనా వల్ల ముందే అయ్యాను అని తెలిపారు.

Also Read : NKR 21 : కళ్యాణ్ రామ్ 21వ సినిమా గ్లింప్స్ అదిరిందిగా.. బ్లాక్ బస్టర్ పంచ్..

సినిమా గురించి మాట్లాడుతూ.. డైరెక్టర్ ఉదయ్ కథ చెప్పినప్పుడే ఆనంద్ ని హీరోగా అనుకున్నాం. ఆనంద్ ఇప్పటివరకు ఇలాంటి కథ చేయలేదు. కొత్తగా కనిపిస్తాడు ఆనంద్ ఈ సినిమాలో. గణేష్ విగ్రహం, డబ్బుతో కథ లింక్ అయి ఉంటుంది. క్రైం కామెడీ జానర్ లో ఈ సినిమాని తీసాము. మా డైరెక్టర్ కామెడీ బాగా రాసుకున్నాడు. ఫైనల్ అవుట్ పుట్ చూసాను, సినిమా బాగా వచ్చింది. గత వినాయకచవితికి ఈ సినిమా రిలీజ్ అనుకున్నాం. కానీ బేబీ సినిమా ముందు వచ్చింది. దాంతో కొంచెం ఆలస్యం అయింది ఈ సినిమా. ఇప్పుడు మే 31న రిలీజ్ చేస్తున్నాం అని తెలిపారు.

ఇక సినిమా బిజినెస్ గురించి మాట్లాడుతూ.. సినిమా మొత్తం బిజినెస్ అయిపోయింది. బిజినెస్ విషయంలో హ్యాపీగా ఉన్నాం. గం గం గణేశా సినిమాని నైజాంలో మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్, ఏపీ, కర్ణాటకలో ధీరజ్ మొగిలినేని ఎంటర్టైన్మెంట్స్ రిలీజ్ చేస్తున్నారు. 400కు పైగా థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నాం. ఆల్రెడీ అమోజాన్ ప్రైమ్ కూడా డిజిటల్ రైట్స్ తీసుకుంది అని తెలిపారు. నా అభిమాన హీరో బాలయ్యతో ఎప్పటికైనా సినిమా తీయాలి అనుకుంటున్నాను అని తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు