×
Ad

Game Changer : గేమ్ ఛేంజర్ మళ్ళీ వాయిదా.. ఎన్టీఆర్ తో చరణ్ పోటీ? దేవర వర్సెస్ గేమ్ ఛేంజర్..?

కొన్ని నెలల క్రితం దిల్ రాజు ఓ ఈవెంట్లో మాట్లాడుతూ గేమ్ ఛేంజర్ సినిమా సెప్టెంబర్ లో రిలీజ్ చేస్తాం అని చెప్పారు.

  • Published On : May 29, 2024 / 04:29 PM IST

Game Changer Vs Devara Releasing Happening Rumours Goes Viral

Game Changer : రామ్ చరణ్ అభిమానులు ‘గేమ్ ఛేంజర్’ సినిమా కోసం ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్నారు. సినిమా మొదలయి మూడేళ్లు అవుతున్నా ఇప్పటిదాకా సరైన అప్డేట్స్ ఇవ్వలేదు. ఒక్క సాంగ్ మాత్రం ఇటీవల రిలీజ్ చేశారు. గేమ్ ఛేంజర్ షూట్ ఇంకా జరుగుతూనే ఉంది. గేమ్ ఛేంజర్ ఆలస్యం విషయంలో మాత్రం చరణ్ అభిమానులు నిరాశ చెందుతున్నారు.

కొన్ని నెలల క్రితం దిల్ రాజు ఓ ఈవెంట్లో మాట్లాడుతూ గేమ్ ఛేంజర్ సినిమా సెప్టెంబర్ లో రిలీజ్ చేస్తాం అని చెప్పారు. కానీ అప్పుడు కూడా వస్తుందో లేదో అని అందరికి అనుమానమే. తాజాగా దిల్ రాజు కుమార్తె హన్షిత మీడియాతో మాట్లాడుతూ గేమ్ ఛేంజర్ సినిమా అక్టోబర్ లో రావొచ్చు అని తెలిపింది. దీంతో సెప్టెంబర్ నుంచి అక్టోబర్ కి గేమ్ ఛేంజర్ వాయిదా పడినట్టే అని ఫ్యాన్స్ మళ్ళీ నిరుత్సాహ పడుతున్నారు.

Also Read : Sudheer Babu : భార్య పెళ్లి చూపుల ఫోటో షేర్ చేసిన హీరో.. అప్పటికి, ఇప్పటికి ఎంత మారిపోయిందో చూడండి..

అయితే అక్టోబర్ 10 దసరా కానుకగా ఎన్టీఆర్ ‘దేవర’ సినిమా వస్తుంది. ఈ సినిమాపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ చేసిన దేవర గ్లింప్స్, సాంగ్స్ తో అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు గేమ్ ఛేంజర్ కూడా అక్టోబర్ అని చెప్పడంతో దేవరకు పోటీగా వస్తుందా? దసరాకు రిలీజ్ అవుతుందా? ఎన్టీఆర్ తో చరణ్ పోటీ పడతాడా అని అంతా చర్చించుకుంటున్నారు. RRRలో ఎన్టీఆర్, చరణ్ కలిసి నటించి భారీ బ్లాక్ బస్టర్ కొట్టి ఇప్పుడు ఇద్దరూ పోటీపడతారా అని సందేహం కూడా వ్యక్తం చేస్తున్నారు. మరి గేమ్ ఛేంజర్ రిలీజ్ ఎప్పుడో అధికారిక డేట్ వచ్చేదాకా ఎవ్వరికి క్లారిటీ లేనట్టే.