×
Ad

Gandhi Talks OTT: ఓటీటీలో మూకీ సినిమా ‘గాంధీ టాక్స్’.. కానీ కండీషన్స్ అప్లై

విజయ్ సేతుపతి మూకీ సినిమా గాంధీ టాక్స్(Gandhi Talks OTT) మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ కి వచ్చేసింది.

gandhi talks movie ott streaming update

  • ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్న మూకీ సినిమా గాంధీ టాక్స్
  • అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్
  • రెంటల్ మోడ్ లో స్ట్రీమింగ్ అవుతున్న మూవీ

Gandhi Talks OTT: ఇండియన్ సినీ చరిత్రలో మూకీ సినిమాలు చాలా రావడం చాలా అరుదు. కానీ, మూకీ సినిమా అంటే మాత్రం టక్కున గుర్తుకు వచ్చేది మాత్రం కమల్ హాసన్ పుష్పక విమానం. సింగీతం శృనివాస్ రావు తెరకెక్కించిన ఈ మంచి విజయం సాధించింది. అయితే, రీసెంట్ గా కూడా ఒక మూకీ సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చింది. అదే గాంధీ టాక్స్(Gandhi Talks OTT).

Sujeeth: ‘గ్యాంగ్ స్టా ట్రియో’ పవన్- ప్రభాస్- నాని .. సుజీత్ యూనివర్స్ లోకి నేచురల్ స్టార్.. ఊగిపోతున్న ఫ్యాన్స్

తమిళ స్టార్స్ విజయ్ సేతుపతి, అరవింద స్వామి కాంబోలో వచ్చిన ఈ సినిమాను దర్శకుడు కిషోర్ పాండురంగ్ బేలేకర్ తెరకెక్కించాడు. ఈ సినిమాలో అదితి రావు హైదరి హీరోయిన్ గా నటించింది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించాడు. ఈ సినిమా జనవరి 30న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే, ఆడియన్స్ ను ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేదు.

తాజాగా ఈ సినిమా ఓటీటీ విడుదలపై అధికారిక ప్రకటన చేశారు మేకర్స్. గాంధీ టాక్స్ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కి వచ్చేసింది. కానీ, ఈ సినిమా ఓటీటీలో చూడాలంటే కేవలం సబ్‌స్క్రిప్షన్ ఉంటే చాలదు.. రెంటల్ మోడ్ లో ప్రస్తుతం ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. మరి థియేటర్స్ లో ప్లాప్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి స్పందన వస్తుంది అనేది చూడాలి.