ప్రముఖ నిర్మాత బెల్లంకొండ రెండో కొడుకు, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తమ్ముడు బెల్లంకొండ గణేష్ బాబు హీరోగా పరిచయమవుతున్న సినిమా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది..
టాలీవుడ్‌లోకి మరో యంగ్ హీరో రాబోతున్నాడు. ప్రముఖ నిర్మాత బెల్లంకొండ రెండో కొడుకు, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తమ్ముడు బెల్లంకొండ గణేష్ బాబు హీరోగా పరిచయమవుతున్న సినిమా పూజా కార్యక్రమాలతో అన్నపూర్ణ స్టూడియోస్‌లోని గ్లాస్ హౌస్‌లో ప్రారంభమైంది. పలువురు సినీ ప్రముఖులు హాజరై.. గణేష్ అండ్ మూవీ టీమ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
బీటెల్ లీఫ్ ప్రొడక్షన్స్ సమర్పణలో.. లక్కీ మీడియా బ్యానర్‌పై అభిరుచి గల నిర్మాతగా పేరొందిన బెక్కెం వేణు గోపాల్ నిర్మిస్తున్నారు. ‘ప్రేమ ఇష్క్ కాదల్’, ‘సావిత్రి’ సినిమాలతో ఆకట్టుకున్న పవన్ సాధినేని దర్శకత్వం వహిస్తున్నాడు. గణేష్‌పై చిత్రీకరించిన ఫస్ట్ షాట్‌కి ప్రముఖ నిర్మాత దిల్ రాజు క్లాప్ నివ్వగా, బెల్లంకొండ శ్రీనివాస్ కెమెరా స్విచ్ఛాన్ చేశాడు.
Read Also : వోగ్ ఇండియా కవర్ పేజీ చూశారా!
వి.వి.వినాయక్ గౌరవ దర్శకత్వం వహించారు. రధన్ సంగీతం, కార్తీక్ ఘట్టమనేని కెమెరా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రొడక్షన్ నెం.10గా తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించి నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోంది. త్వరలో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుంది.