Gautham Tinnanuri: కింగ్డమ్ ఎఫెక్ట్.. ‘మ్యాజిక్’ను ఎవరు పట్టించుకోవడం లేదా.. అనిరుధ్ కూడానా..

మ్యాజిక్.. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి నెక్స్ట్ సినిమా. నిజానికి(Gautham Tinnanuri) ఈ సినిమా వస్తుందని కూడా చాలా మందికి తెలియదు. దానికి కారణం కింగ్డమ్ మూవీ.

Director Gautham Tinnanuri has shelved the film Magic.

Gautham Tinnanuri: మ్యాజిక్.. దర్శకుడు గౌతమ్ తిన్ననూరి నెక్స్ట్ సినిమా. నిజానికి ఈ సినిమా వస్తుందని కూడా చాలా మందికి తెలియదు. దానికి కారణం కింగ్డమ్ మూవీ. విజయ్ దేవరకొండ హీరోగా గౌతమ్ తిన్ననూరి తెరకెక్కించిన పాన్ ఇండియా మూవీ కింగ్డమ్.(Gautham Tinnanuri) సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్, భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్, అనిరుధ్ మ్యూజిక్ ఇవన్నీ కలిసి సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేసింది. కానీ, విడుదల తరువాత ఆ అంచనాలను అందుకోలేకపోయింది ఈ సినిమా. అయితే, కింగ్డమ్ సినిమా షూట్ టైం లోనే మ్యాజిక్ అనే చిన్న సినిమాను స్టార్ట్ చేశాడు దర్శకుడు గౌతమ్ తిన్ననూరి.

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ లో వైల్డ్ టాస్క్.. రమ్య తలకు గాయం.. ఇక ఆ ముగ్గురిలోనే ఒకరు

షూటింగ్ కూడా ఎప్పుడో కంప్లీట్ అయింది. అంతా కొత్తవాళ్లతో మ్యూజికల్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమాకు కూడా అనిరుధ్ సంగీతం అందించాడు. కానీ, రెండు సినిమాలను ఒకేసారి ప్రమోషన్స్ చేస్తే ఇంపాక్ట్ వేరేలా పడే అవకాశం ఉంది. కాబట్టి, మ్యాజిక్ సినిమాను కాస్త పక్కన పెట్టి కింగ్డమ్ పై ఫోకస్ పెట్టారు. కచ్చితంగా ఆ సినిమా హిట్ అవుతుందని, అదే జోష్ లో మ్యాజిక్ కూడా ప్రమోట్ చేయాలని భావించారు. కానీ, ప్లాన్ బెడిసికొట్టింది. కింగ్డమ్ సినిమాకు అనుకున్న రిజల్ట్ రాకపోవడంతో మ్యాజిక్ సినిమా పక్కకు వెళ్ళిపోయింది.

ఈ సినిమా గురించి కూడా ఎవరు పట్టించుకోవడం లేదట. అనిరుధ్ మ్యూజిక్, డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి లాంటి స్టార్స్ పని చేసినప్పటికీ ఈ సినిమాకి ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. ఇండస్ట్రీ టాక్ ప్రకారం మ్యాజిక్ సినిమాలో మంచి యూత్ అండ్ ఎమోషనల్ కంటెంట్ ఉందట. మరి ఇకనైనా ఈ సినిమాపై ఫోకస్ పెడతారా.. లేక హిట్ కొట్టిన తరువాతనే మ్యాజిక్ సినిమాను ప్రమోట్ చేసే పనిపెట్టుకుంటారా అనేది చూడాలి.