Gaaya Padda Simham:’గాయపడ్డ సింహం’టీజర్ వచ్చేసింది.. పంచులతో అదరగొట్టేసింది తరుణ్ భాస్కర్
తరుణ్ భాస్కర్ గాయపడ్డ సింహం(Gaaya Padda Simham) మూవీ టీజర్ విడుదల అయ్యింది.
- V Santhosh Kumar
- Published On : February 9, 2026 / 01:46 PM IST
gayapadda simham teaser released
Gaaya Padda Simham; టాలీవుడ్ దర్శకుడు తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రలో వస్తున్న లేటెస్ట్ మూవీ ‘గాయపడ్డ సింహం(Gaaya Padda Simham)’. ‘డోన్ట్ లాఫ్… ఇట్స్ ఏ సీరియస్ మేటర్’ అనేది ట్యాగ్ లైన్. ఫరియా అబ్దుల్లా, మానసా చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను కాశ్యప్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్నాడు. దర్శకుడు పవన్ సాధినేని సమర్పణలో కల్యాణ చక్రవర్తి మంతిన, భానుకిరణ్ ప్రతాప, విజయ్ కృష్ణ లింగమనేని, ఉమేష్ బన్సల్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ విడుదల చేశారు మేకర్స్. టీజర్ ఆడియన్స్ ను ఆకట్టుకునేలా ఉంది. ‘పెళ్లి చూపులు సినిమా యావరేజ్.. కానీ, ఓవర్ హైప్ అయింది అంతే’ అంటూ తరుణ్ భాస్కర్ చెప్పే డైలాగ్ హైలెట్ గా నిలిచింది. ఇలా తన సినిమాపై తానే సెటైర్ వేసుకొని నవ్వులను పంచుతున్నారు తరుణ్ భాస్కర్. పొలిటికల్ సెటైర్, క్రైమ్, కామెడీ లాంటి ఎమోషన్స్ వస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
Satya Sri: జబర్దస్త్ బ్యూటీ జబర్దస్త్ అందాలు.. సత్య శ్రీ లేటెస్ట్ ఫొటోలు
