Geetha Bhagat : ఆయన చెప్పింది నిజం.. చిరంజీవి ఇష్యూపై యాంకర్ గీత భగత్ కామెంట్స్..
తాజాగా యాంకర్ గీత భగత్ ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరంజీవి కామెంట్స్ పై స్పందించింది. (Geetha Bhagat)
- Saketh U
- Published On : February 26, 2026 / 10:43 AM IST
Geetha Bhagat
- గతంలో చిరంజీవి కామెంట్స్
- స్పందించిన యాంకర్ గీత భగత్
- ఆయన చెప్పిందే నిజం
Geetha Bhagat : ఇటీవల మన శంకర వరప్రసాద్ గారు సక్సెస్ ఈవెంట్లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ.. ఇండస్ట్రీ అద్దం లాంటిది. మనం ఎలా ఉంటే అలా ఉంటుంది. నువ్వు కష్టపడితే రిజల్ట్ వస్తుంది. ఇండస్ట్రీకి అందరూ రావొచ్చు. క్యాస్టింగ్ కౌచ్ లాంటివి ఇక్కడ ఉండవు. మీకుండే అభద్రతా భావం వల్లే అలాంటివి ఉంటాయి. నువ్వు ప్రొఫెషనల్ గా ఉంటే అందరూ ప్రొఫెషనల్ గానే ఉంటారు. చాలా మంది సక్సెస్ అయ్యారు. అమ్మాయిలు రావాలి సినీ పరిశ్రమలోకి అని అన్నారు.
అయితే చిరంజీవి సినీ పరిశ్రమలోకి వచ్చే మహిళలకు భరోసా ఇచ్చేలా మాట్లాడుతూ ఇండస్ట్రీకి రమ్మని ధైర్యం కోసం చెప్తే పలువురు దీన్ని వివాదంగా మార్చారు. చిరంజీవికి ఏం తెలుసు, ఇండస్ట్రీ అలా లేదు అంటూ చిరుపై కొంతమంది విమర్శలు చేసారు. తాజాగా యాంకర్ గీత భగత్ ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరంజీవి కామెంట్స్ పై స్పందించింది.
Also See : Priyanka Chopra : ప్రియాంక చోప్రా ‘ది బ్లఫ్’ సినిమా వర్కింగ్ స్టిల్స్..
యాంకర్ గీత భగత్ మాట్లాడుతూ.. చిరంజీవి గారు మొన్న ఓ విషయం చెప్తే కొంతమంది గోల చేసారు. ఆయన సినీ పరిశ్రమ అద్దం లాంటిది అన్నారు. ఆయన అన్న మాటల్లో ఆ ఒక్క పాయింట్ చాలు. మీరు ఎలా ఉంటారో అలానే కనిపిస్తుంది ఇండస్ట్రీ. అదే నిజం. ఒక మహిళగా మీరు ఎలా ఉంటారో అలానే, మీరు ఏది ఎంచుకుంటారో అదే, మీరు ఏది కావాలని ఎంచుకుంటారో దాన్ని బట్టే మీరు సమస్యలని ఫేస్ చేస్తారు. మనం ఎక్కడ ఎంతలో ఉన్నామో అక్కడనుంచే ప్లాన్ చేసుకోవాలి. ఎక్కువ ఆలోచిస్తే వేరే డైరెక్షన్స్ తీసుకోవాలేమో అని ఆలోచనలు వస్తాయి. మనవల్ల అవుతుందా లేదా అని చూసుకోవాలి అని అన్నారు.
