Genelia : ఆహా సింగింగ్ షో కోసం వచ్చిన ‘హాసిని’.. జెనీలియా క్యూట్ ఎపిసోడ్..
తెలుగు ఇండియన్ ఐడల్ నాలుగో సీజన్ ఇటీవలే మొదలైంది. ప్రస్తుతం నాలుగో సీజన్ కి సంబంధించిన ఎపిసోడ్స్ ఆహా ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్నాయి.(Genelia)

Genelia
Genelia : తెలుగు ఓటీటీ ఆహా కొత్త సినిమాలు, సిరీస్ లు, షోలతో దూసుకుపోతుంది. ఈ క్రమంలో ఆహా సూపర్ హిట్ సింగింగ్ షో తెలుగు ఇండియన్ ఐడల్ చేస్తుంది. ఇప్పటికే మూడు సీజన్లు అవ్వగా తెలుగు ఇండియన్ ఐడల్ నాలుగో సీజన్ ఇటీవలే మొదలైంది. ప్రస్తుతం నాలుగో సీజన్ కి సంబంధించిన ఎపిసోడ్స్ ఆహా ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్నాయి.(Genelia)
ఇక ఆహా షోలలో అప్పుడప్పుడు సెలబ్రిటీలు వచ్చి సందడి చేస్తారని తెలిసిందే. తాజాగా తెలుగు ఇండియన్ ఐడల్ షోకి మన ఫేవరేట్ జెనీలియా వచ్చి సందడి చేసింది. ఎపిసోడ్ లో పాల్గొన్న కంటెస్టెంట్స్ తమ పాటలతో జెనీలియాకు మెప్పించారు. త్వరలోనే జెనీలియా వచ్చిన ప్రోమో, ఎపిసోడ్ రిలీజ్ చేయనున్నారు. ప్రతి శుక్ర, శని వారాలు కొత్త ఎపిసోడ్స్ ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నాయి.
Also See : Lokah Chapter 1 Chandra : మలయాళం హిట్ సినిమా.. తెలుగులో సక్సెస్ మీట్.. ఫొటోలు..
ఇక ఈ తెలుగు ఇండియన్ ఐడల్ షోలో మ్యూజిక్ డైరెక్టర్ తమన్, గాయకులు కార్తీక్ మరియు గీతా మాధురి జడ్జెస్ గా ఉండగా శ్రీరామచంద్ర తో పాటు సమీరా భరద్వాజ్ హోస్ట్ గా ఎంటర్టైన్ చేస్తున్నారు.