Star Producer : అల్లు అర్జున్ సినిమాలో యాక్టింగ్ చేసినందుకు నిర్మాతను తిట్టిన భార్య.. ఈ స్టార్ ప్రొడ్యూసర్ ఎవరో తెలుసా?
తాజాగా ఓ స్టార్ ప్రొడ్యూసర్ ఎప్పుడో 20 ఏళ్ళ క్రితం ఓ సినిమాలో నటించిన వీడియో బయటకు వచ్చింది.(Star Producer)

Star Producer
Star Producer : నిర్మాతలు, దర్శకులు అప్పుడప్పుడు తెరపై అలా మెరిపిస్తారని తెలిసిందే. తాజాగా ఓ స్టార్ ప్రొడ్యూసర్ ఎప్పుడో 20 ఏళ్ళ క్రితం ఓ సినిమాలో నటించిన వీడియో బయటకు వచ్చింది. ఆ వీడియో చూసుకొని నిర్మాత కూడా ఫుల్ గా నవ్వుకొని ఆ సీన్ వెనక ఏం జరిగింది? ఎందుకు యాక్ట్ చేసాడో చెప్పుకొచ్చాడు.(Star Producer)
పై ఫొటోలో ఒక స్టార్ నిర్మాతే కాదు దర్శకుడు కూడా ఉన్నారు. ఇంతకీ ఎవరంటే.. ఈ ఫొటోలో ఉన్న నిర్మాత బన్నీ వాసు. అలాగే వకీల్ సాబ్ ఫేమ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్. ఈ ఫొటోలో ఉన్న మరో వ్యక్తి దిల్ రాజు ఆఫీస్ అకౌంటెంట్ శ్రీధర్. ఈ సీన్ అల్లు అర్జున్ ఆర్య సినిమాలోది. తాజాగా బన్నీ వాసు నిర్మించిన లిటిల్ హార్ట్స్ సినిమా సెప్టెంబర్ 5న రిలీజవుతుండగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చేసిన ఓ ఈవెంట్లో ఈ వీడియోని బయటపెట్టారు.
Also Read : Thrigun : తండ్రి అయిన హీరో.. పవన్ కళ్యాణ్ పుట్టిన రోజునే డెలివరీ..
దీని గురించి బన్నీ వాసు మాట్లాడుతూ.. ఇది ఆర్య సినిమాలో సీన్. ఆ రోజు షూటింగ్ కి రావాల్సిన ఓ ముగ్గురు అబ్బాయిలు రాలేదు. దాంతో సుకుమార్ ఖాళీగా ఉన్నామని మా ముగ్గుర్ని తీసుకొచ్చి ఆ సీన్ షూట్ చేసారు. ఆ తర్వాత అది చూసి మా ఆవిడ నన్ను తిట్టింది. ఇంకోసారి యాక్టింగ్ చేయను. ఇటీవల ఓ సినిమా కోసం కూడా ఒక రీల్ చేశాను కాను అది చూస్తే ట్రోల్ చేస్తారని నేనే బయటకు రిలీజ్ చేయొద్దని చెప్పాను అని తెలిపారు.
ఈ సీన్ లో ఉంది దిల్ రాజు ఆఫీస్ అకౌంటెంట్ శ్రీధర్ , ప్రొడ్యూసర్ బన్నీ వాస్ వకీల్ సాబ్ డైరెక్టర్ శ్రీరామ్ వేణు. 😃#LittleHearts #Aarya
pic.twitter.com/bmvACGNF8s— Suresh PRO (@SureshPRO_) September 3, 2025
చిరంజీవి అభిమానిగా సినీ పరిశ్రమలోకి వచ్చిన వాసు అల్లు అర్జున్ కి దగ్గరయి, క్లోజ్ ఫ్రెండ్ అవ్వడం, బన్నీకి మేనేజర్ గా పనిచేయడం అక్కడ్నుంచి గీత ఆర్ట్స్ నిర్మాణ సంస్థల్లోకి ఎంటర్ అయి ఇప్పుడు స్టార్ ప్రొడ్యూసర్ గా ఎదిగారు. అల్లు అర్జున్ కూడా బన్నీ వాసు తనకి ఎంత క్లోజ్ అనేది పలు వేదికలపై తెలిపాడు.
Also See : Jabardasth Abhi : ఆ నటితో జబర్దస్త్ అభి క్లోజ్ ఫొటోలు వైరల్..