Thrigun : తండ్రి అయిన హీరో.. పవన్ కళ్యాణ్ పుట్టిన రోజునే డెలివరీ..

2023 లో అదిత్ అరుణ్ నివేదితా అనే అమ్మయిని పెళ్లి చేసుకున్నాడు. తాజాగా అదిత్ అరుణ్ - నివేదిత జంట పండంటి బిడ్డకు జన్మనిచ్చారు.(Thrigun)

Thrigun : తండ్రి అయిన హీరో.. పవన్ కళ్యాణ్ పుట్టిన రోజునే డెలివరీ..

Thrigun

Updated On : September 4, 2025 / 7:08 AM IST

Thrigun : తెలుగులో కథ, 24 కిసెస్, డియర్ మేఘ, కొండా, లైన్ మెన్, ప్రేమ దేశం, ఉద్వేగం.. లాంటి పలు సినిమాలతో మెప్పించిన హీరో అదిత్ అరుణ్ అలియాస్ త్రిగుణ్. అదిత్ అరుణ్ ఎన్నో ఏళ్లుగా సినీ పరిశ్రమలో ఉన్నాడు. హీరోగా, కీలక పాత్రల్లో సినిమాలు చేస్తున్నాడు. 2023 లో అదిత్ అరుణ్ నివేదితా అనే అమ్మయిని పెళ్లి చేసుకున్నాడు.(Thrigun)

తాజాగా అదిత్ అరుణ్ – నివేదిత జంట పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. అదిత్ తన భార్య బేబీ బంప్ తో ఉన్న ఫోటో షేర్ చేసి సెప్టెంబర్ 2న డెలివరీ అయినట్టు తెలిపాడు. అయితే పుట్టింది పాప? లేక బాబు అనేది మాత్రం చెప్పలేదు. పలువురు సెలబ్రిటీలు, నెటిజన్లు తాజాగా తల్లితండ్రులు అయిన ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Adith Eswaran (@adith_officiall)

Also See : Jabardasth Abhi : ఆ నటితో జబర్దస్త్ అభి క్లోజ్ ఫొటోలు వైరల్..

ఇక సెప్టెంబర్ 2 న పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు కావడంతో పవన్ పుట్టిన రోజు నాడు పుట్టారు అని పలువురు ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.