×
Ad

Gnaneswari Kandregula : పదేళ్ల క్రితం చరణ్ ని కలిసుంటే పెళ్లి చేసుకోమని అడిగేదాన్ని.. నటి జ్ఞానేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు..

తాజాగా జ్ఞానేశ్వరి ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా పలు ఆసక్తికర విషయాలని తెలిపింది. గతంలోనే జ్ఞానేశ్వరి.. తాను చరణ్(Ram Charan) కి పెద్ద ఫ్యాన్ అని, చిన్నప్పట్నుంచి చరణ్ ఫోటోలు కట్ చేసి పుస్తకంలో అతికించేదాన్ని అని చెప్పింది.

  • Published On : December 6, 2023 / 02:55 PM IST

Gnaneswari Kandregula wanted to Marry Ram Charan if She met him before Ten Years

Gnaneswari Kandregula : తెలుగమ్మాయి జ్ఞానేశ్వరి కాండ్రేగుల మోడల్ గా, నటిగా కెరీర్ ప్రారంభించి పెళ్లి చూపులు అనే ఓ షోతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, పలు చిన్న సినిమాల్లో హీరోయిన్ గా మెప్పించింది. ప్రస్తుతం సినిమాల్లో, సిరీస్ లలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా దూసుకుపోతుంది. ఇటీవలే మంత్ అఫ్ మధు అనే సినిమాలో మంచి పాత్ర చేసింది. తాజాగా నాగచైతన్య నటించిన దూత సిరీస్ లో ఓ పాత్రతో మెప్పించింది.

తాజాగా జ్ఞానేశ్వరి ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇవ్వగా పలు ఆసక్తికర విషయాలని తెలిపింది. గతంలోనే జ్ఞానేశ్వరి.. తాను చరణ్(Ram Charan) కి పెద్ద ఫ్యాన్ అని, చిన్నప్పట్నుంచి చరణ్ ఫోటోలు కట్ చేసి పుస్తకంలో అతికించేదాన్ని అని చెప్పింది. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో దీని గురించి ప్రస్తావిస్తూ.. ఆ పుస్తకం ఇంకా ఉంది. పుస్తకం నిండా చరణ్ ఫోటోలు ఉన్నాయి. ఈ సారి ఇంటర్వ్యూలో ఆ ఫోటోలు ఉన్న పుస్తకం తెచ్చి మొత్తం చూపిస్తాను అని తెలిపింది.

Also Read : Animal Movie : యానిమల్‌లో ఆ సాంగ్ బిట్ కంపోజ్ చేసింది.. బిగ్‌బాస్ కంటెస్టెంట్ అని మీకు తెలుసా..?

అలాగే.. చరణ్ ని కలిస్తే ఏమడుగుతారు అని అడిగితే.. ఒక పదేళ్ల క్రితం చరణ్ ని కలిస్తే పెళ్లి చేసుకుంటారా అని అడిగేదాన్ని ఇప్పుడు మీతో కలిసి వర్క్ చేయాలని ఉండి అని మాత్రమే అడుగుతాను అని తెలిపింది. దీంతో జ్ఞానేశ్వరి చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. చరణ్ అభిమానులు ఇంకో నటి రామ్ చరణ్ కి ఇంత పెద్ద ఫ్యాన్ అని ప్రమోట్ చేస్తున్నారు.