Animal Movie : యానిమల్‌లో ఆ సాంగ్ బిట్ కంపోజ్ చేసింది.. బిగ్‌బాస్ కంటెస్టెంట్ అని మీకు తెలుసా..?

యానిమల్‌లో 'చిన్ని చిన్ని ఆశ' సాంగ్ బిట్ కంపోజ్ చేసింది బిగ్‌బాస్ కంటెస్టెంట్ అని మీకు తెలుసా..?

Animal Movie : యానిమల్‌లో ఆ సాంగ్ బిట్ కంపోజ్ చేసింది.. బిగ్‌బాస్ కంటెస్టెంట్ అని మీకు తెలుసా..?

Animal Movie chinni chinni aasa bit composed by telugu biggboss contestant

Updated On : December 6, 2023 / 12:00 PM IST

Animal Movie : బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ తో టాలీవుడ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన యాక్షన్ మూవీ ‘యానిమల్’. అనిల్ కపూర్, బాబీ డియోల్, రష్మిక మందన్న, తృప్తి దిమ్రీ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమా నాన్న ఎమోషన్ ని వైల్డ్ గా చూపించి ఆడియన్స్ ని థ్రిల్ చేస్తుంది. ఈ సినిమాలో ప్రతి సీన్ ని చాలా కొత్తగా చూపించిన సందీప్ వంగ.. ఓల్డ్ సూపర్ హిట్ సాంగ్స్ ని అక్కడ అక్కడ ఉపయోగించిన తీరు ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటుంది. ఈక్రమంలోనే ఏ ఆర్ రెహమాన్ స్వరపరిచిన ‘చిన్ని చిన్ని ఆశ’ సాంగ్ మ్యూజిక్ ని కూడా యూజ్ చేశారు.

ఈ మ్యూజిక్ కి రణబీర్ వేసే డాన్స్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటుంది. అయితే ఈ సాంగ్ బిట్ కి డాన్స్ కంపోజ్ చేసింది బిగ్‌బాస్ కంటెస్టెంట్ అని మీకు తెలుసా..? ఇటీవల తెలుగు బిగ్‌బాస్ 7లోకి కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి ఎనిమిది వారలు హౌస్ లో ఉండి ఎలిమినేట్ అయిన ఆట సందీప్.. ‘చిన్ని చిన్ని ఆశ’ మ్యూజిక్ బిట్‌కి డాన్స్ కంపోజ్ చేశారట. ఈ విషయాన్ని సందీప్ స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ప్రస్తుతం ఆ డాన్స్ బిట్ నెట్టింట బాగా వైరల్ అవుతుండడంతో, సందీప్ దానిని షేర్ చేసి.. కంపోజ్ చేసింది తానే అని పేర్కొన్నారు.

Also read : Animal Movie : యానిమల్ మూవీ ఆ హీరోయిన్ చేయాల్సింది.. కానీ రష్మిక ఎంట్రీ..

 

View this post on Instagram

 

A post shared by ???? ??????? ????? ???????? (@aata_sandeep)

తనకి ఈ అవకాశం ఇచ్చినందుకు సందీప్ వంగకి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇక ఇది తెలిసిన అభిమానులు షాక్ అవుతున్నారు. అలాగే ఆట సందీప్ కి కంగ్రాట్యులేషన్స్ తెలియజేస్తున్నారు. ఇది ఇలా ఉంటే, యానిమల్ మూవీ పై అనేక విమర్శలు వస్తున్నాయి. కానీ కలెక్షన్స్ కి మాత్రం అవేవి అడ్డురావడం లేదు. ఇప్పటి వరకు ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 425 కోట్ల గ్రాస్ ని అందుకుంది. ఇదే స్పీడ్ కొనసాగితే త్వరలో ఈ మూవీ 1000 కోట్ల మార్క్ ని అందుకోవడం కూడా పెద్ద కష్టం కాదు అంటున్నారు ట్రేడ్ పండితులు.