Godfather: మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘గాడ్‌ఫాదర్’ కోసం ప్రేక్షకులు ఏ రేంజ్లో ఎదురుచూస్తున్నారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ సినిమాను దర్శకుడు మోహన్ రాజా తెరకెక్కిస్తుండగా, మలయాళ సూపర్ హిట్ మూవీ ‘లూసిఫర్’కు తెలుగు రీమేక్‌గా ఈ సినిమా వస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర పోస్టర్స్, టీజర్ ప్రేక్షకుల్లో గాడ్‌ఫాదర్‌పై అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేశాయి. ఇక ఈ సినిమాలో నుండి ఫస్ట్ సింగిల్ సాంగ్‌ను తాజాగా రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.
Godfather: గాడ్‌ఫాదర్ ప్రీ-రిలీజ్ ఈవెంట్ జరిగేది అక్కడేనా..?
ఇటీవల ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ సాంగ్‌ను ఆడియో రూపంలో రిలీజ్ చేయగా, తాజాగా లిరికల్ సాంగ్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ సాంగ్ ఆద్యంతం మాస్ బీట్తో సాగడంతో ఈ పాట మెగా ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగిస్తోంది. ఈ పాటలో మెగాస్టార్ చిరంజీవితో పాటు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కూడా చిందులేయడంతో ఈ పాటను ఎప్పుడెప్పుడు వెండితెరపై చూద్దామా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ‘‘బాసులు వచ్చిండ్రే.. బేసులు పెంచుండ్రే..’’ అంటూ శ్రేయ ఘోషాల్ పాడిన ఈ పాటకు అనంత్ శ్రీరామ్ లిరిక్స్ అందించాడు. థమన్ ఈ సాంగ్‌ను తనదైన స్టయిల్లో రెచ్చిపోయి దంచాడు.
Godfather: తార్ మార్ టక్కర్ మార్.. అంటూ గాడ్‌ఫాదర్‌తో దుమ్ములేపిన సల్మాన్ ఖాన్
ఇక ఈ పాటలో చిరు, సల్మాన్ ఖాన్ కలిసి చేసిన కొన్ని స్టెప్స్ థియేటర్లలో టాప్ లేపడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ సినిమాలో సత్యదేవ్, నయనతార, పూరీ జగన్నాధ్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, సూపర్ గుడ్ ఫిలింస్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తుండగా, దసరా కానుకగా ఈ సినిమాను అక్టోబర్ 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. మరి ఈ ‘‘తార్ మార్’’ సాంగ్‌పై మీరు ఓ లుక్కేయండి.