కళారత్న : ఆకాశవాణిలో పనిచేసిన గొల్లపూడి

  • Publish Date - December 12, 2019 / 08:10 AM IST

గొల్లపూడి మారుతీరావు..ఇక లేరు. ఆయన 2019, డిసెంబర్ 12వ తేదీ గురువారం చెన్నైలోని ఓ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు. ఈయన ఒక సుప్రసిద్ధ రచయిత. వ్యాఖ్యాతగా బుల్లితెరపై తనదైన ముద్ర వేశారు. తెలుగు సాహిత్యంపై ఆయన ఎన్నో పరిశోధనాత్మక రచనలు చేశారు. 1939 ఏప్రిల్ 14న విజయనగరంలో ఒక మధ్య తరగతి కుటుంబంలో జన్మించారు. 

* 1959లో ఆంధ్రప్రభ ఉప సంచాలకునిగా పనిచేశారు. 
* రెడీయోలో ట్రాన్స్ మిషన్ ఎగ్జిక్యూటివ్ గా ఎంపికయ్యారు. 
* హైదరాబాద్, విజయవాడల్లో పనిచేశారు. 
* 1981లో ఆకాశవాణి కడప కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ గా పదోన్నతి పొందిన ఆయన రెండు దశాబ్దాలుగా అందులో పనిచేశారు. 
* అసిస్టెంట్ సేషన్ డైరెక్టర్ హోదాలో పదవీ విరమణ చేశారాయన. 
* పలు చిత్రాలకు ఆయన కథా రచయితగా పనిచేశారు. 
* 250 చిత్రాలకు పైగా సహా నటుడిగా, హాస్య నటుడిగా మెరిశారు. 
* ఏపీ సాహిత్య అకాడమీ నిర్వహించిన పోటీలకు సంబంధించిన జ్యూరీ సభ్యుల్లో ఒకరిగా వ్యవహరించారు. 
* జాతీయ చలన చిత్ర అభివృద్ధి మండలి స్క్రిప్ట్ పరిశీలన విభాగంలో పనిచేశారు. 
* మారుతీరావు తన కుమారుడి జ్ఞాపకంగా గొల్లపూడి శ్రీనివాస్ జాతీయ అవార్డును నెలకొల్పారు. 
* మారుతీరావుకు ఏపీ ప్రభుత్వంతో నుంచి కళారత్నతో పాటు..మరెన్నో విశిష్ట పురస్కరాలు లభించాయి. 
Read More : గొల్లపూడి మారుతీరావు కన్నుమూత

ట్రెండింగ్ వార్తలు