Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9లో షాకింగ్ ఓటింగ్.. టాప్ లో సుమన్ శెట్టి.. ఫస్ట్ వీక్ ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే?

బిగ్ బాస్ సీజన్ 9 రసవత్తరంగా సాగుతోంది. షో స్టార్ట్ అయిన(Bigg Boss 9 Telugu) మొదటిరోజు నుంచే కంటెస్టెంట్స్ మధ్య గొడవలు పెట్టడంలో ఫుల్ సక్సెస్ అయ్యాడు బిగ్ బాస్.

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9లో షాకింగ్ ఓటింగ్.. టాప్ లో సుమన్ శెట్టి.. ఫస్ట్ వీక్ ఎలిమినేట్ అయ్యేది ఎవరంటే?

First week elimination in Bigg Boss Season 9

Updated On : September 12, 2025 / 7:16 AM IST

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ సీజన్ 9 రసవత్తరంగా సాగుతోంది. షో స్టార్ట్ అయిన మొదటిరోజు నుంచే కంటెస్టెంట్స్ మధ్య గొడవలు పెట్టడంలో ఫుల్ సక్సెస్ అయ్యాడు బిగ్ బాస్. ఇక అక్కడినుండి ఎంటర్టైన్ అవడం ఆడియన్స్ వంతు అయ్యింది. ఇదిలా ఉంటే, బిగ్ బాస్ సీజన్ 9 ఫస్ట్ వీక్ నామినేషన్స్ కూడా ఉత్కంఠగా సాగాయి. ఈవారం శ్రష్ఠి వర్మ, ఫ్లోరా షైనీ, రీతూ చౌదరి, సంజనా గల్రానీ, తనూజా గౌడ, సుమన్ శెట్టి, రాము రాథోడ్, డీమన్ పవన్(Bigg Boss 9 Telugu), ఇమ్మానుయేల్ నామినేషన్స్ లో ఉన్నారు.

Mirai X Review: మిరాయ్ ఎక్స్ రివ్యూ: సూపర్ హీరో తేజ సజ్జ.. సినిమా ఎలా ఉంది.. ఆడియన్స్ రియాక్షన్ ఏంటి?

దీనికి సంబందించిన ఓటింగ్ కూడా ఇప్పటికే మొదలయ్యింది. అయితే ఓటింగ్ లో అనూహ్యంగా కమెడియన్ సుమన్ శెట్టి టాప్ లో ఉన్నడటం ఆశ్చర్యం కలిగించింది. ఇంట్లోకి అడుగుపెట్టినప్పటినుంచి పెద్దగా ఎక్కడా కనిపించలేదు సుమన్ శెట్టి. కానీ, ఆయనే ఓటింగ్ లో టాప్ లో నిలవడం విశేషంగా అనిపించింది. 24% ఓటింగ్ తో టాప్ లో ఉన్నాడు. ఆ తరువాత 20 శాతం ఓటింగ్ తో నటి తనూజ గౌడ ఉంది. కమెడియన్ ఇమ్మానుయేల్ 15 శాతం ఓట్లతో, డీమన్ పవన్ 11 శాతం ఓట్లతో, సంజనా గల్రానీకి 8 శాతం ఓట్లు, రాము రాథోడ్‌‌కి కూడా 8 శాతం ఓట్లే పడ్డాయి.

ఇక స్టార్ కంటెస్టెంట్ గా ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చిన రీతూ చౌదరికి కేవలం 6 శాతం ఓట్లు మాత్రమే పడ్డాయి. ఇక మొదటి వారం డేంజర్ జోన్ లో ఫ్లోరా షైనీ, శ్రష్ఠి వర్మలు ఉన్నారు. వీరికి కేవలం 2 శాతం ఓట్లు మాత్రమే పడ్డాయి. కాబట్టి, బిగ్ బాస్ సీజన్ 9 మొదటివారం ఎలిమినేషన్ లో భాగంగా ఫ్లోరా షైనీ, శ్రష్ఠి వర్మ ఈ ఇద్దరిలో ఒకరు బయటకు వెళ్లే అవకాశం ఉంది. కానీ, ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు శ్రష్ఠి వర్మ సేఫ్ అయ్యి.. ఫ్లోరా షైనీ ఎలిమినేట్ అవుతారని తెలుస్తోంది. చూడాలి మరి ఈ సీజన్ మొదటి ఎలిమినేట్ ఎవరు అవుతారా అని.