BharataVarsha : గోపీచంద్ కొత్త సినిమా టైటిల్ ఇదే..
గోపించంద్ హీరోగా, సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రానికి భరత వర్ష (BharataVarsha)అనే టైటిల్‌ను ఖరారు చేశారు.
- Thota Vamshi Kumar
- Published on- April 13, 2026 / 12:06 PM IST
Gopichand and Sankalp movie title is BharataVarsha
BharataVarsha : గోపీ చంద్ హీరోగా సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. గోపీచంద్ కెరీర్‌లో 33వ సినిమాగా రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రానికి భరత వర్ష అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. గుర్రాలూ, కత్తి యుద్ధాలతో టైటిల్ గ్లింప్స్ అదిరిపోయింది.
Anna Lezhneva : మా ఆయన నాకు పియానో కొనిచ్చారు.. చిన్నప్పటి ఫోటో షేర్ చేసి పవన్ భార్య పోస్ట్..
ఈ చిత్రంలో రీతూ వర్మ కథానాయిక. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రన్ని నిర్మిస్తున్నారు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ మూవీ తెరకెక్కుతోంది. అనుదీప్ దేవ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఘాజీ, అంతరిక్షం వంటి చిత్రాలను తెరకెక్కించిన సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో ఈ మూవీ రూపుదిద్దుకుంటుండడంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.
