Gopichand : మీ తండ్రిని చూసి అవకాశం ఇచ్చా.. నువ్వేం పీకావ్.. గోపీచంద్ పై తేజ కామెంట్స్!
డైరెక్టర్ తేజ హీరో గోపీచంద్ పై వైరల్ కామెంట్స్ చేశాడు. నీ తండ్రి గొప్పవాడు, నువ్వేమి పికావు అంటూ..
- gum 95921
- Published On : April 25, 2023 / 08:30 PM IST
gopichand interview with director teja on ramabanam promotions
Gopichand : మ్యాచో స్టార్ గోపీచంద్ నటిస్తున్న తాజా చిత్రం రామబాణం (Ramabanam). శ్రీవాసు ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన లక్ష్యం, లౌక్యం సినిమాలు సూపర్ హిట్టుగా నిలిచాయి. ఇప్పుడు మూడోసారి ఈ కాంబినేషన్ తెర పైకి రావడంతో మూవీ పై ప్రకటనతోనే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి. మే 5న ఈ చిత్రం విడుదలకు సిద్దమవుతుంది. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ సందడి చేస్తున్నారు.
Ramabanam Trailer: రామబాణం ట్రైలర్.. ఫుల్ మీల్స్ పట్టుకొచ్చిన గోపీచంద్
ఈ క్రమంలోనే సాంగ్ అండ్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్స్ ని గ్రాండ్ గా నిర్వహిస్తూ వస్తున్నారు. తాజాగా గోపీచంద్, దర్శకుడు తేజకి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. అందుకు సంబంధించిన ప్రోమో రిలీజ్ చేయగా.. ముక్కు సూటిగా మాట్లాడే తేజ గోపీచంద్ ని ప్రశ్నిస్తూ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. గోపీచంద్ కి ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది తేజనే. ఈ దర్శకుడు తెరకెక్కించిన జయం, నిజం చిత్రాల్లో విలన్ గా నటించిన సంగతి తెలిసిందే. అయితే జయం సినిమాలో గోపీచంద్ కి అవకాశం తన తండ్రి మంచితనం చూసే ఇచ్చాడని చెప్పుకొచ్చిన తేజ.. నువ్వేమి పికావు అంటూ గోపీచంద్ ని ప్రశ్నించాడు.
అలాగే రామబాణం షూటింగ్ సమయంలో గోపీచంద్ కి, శ్రీవాసుకి గొడవలు అయ్యినట్లు వార్తలు వినిపించాయి. వాటిలో నిజం ఉందా? అని తేజ ప్రశ్నించగా, గోపీచంద్ బదులిస్తూ.. హీరోయిన్ మరియు అనవసరమైన సీన్స్ గురించి? అంటూ చెప్పడం ప్రోమోలో కనిపించింది. అలాగే తనకి లైఫ్ ఇచ్చిన తేజ ఫోన్ చేసినప్పుడు గోపీచంద్ లిఫ్ట్ చేయలేదట. ఇవన్నీ తెలియాలి అంటే ఫుల్ ఇంటర్వ్యూ చూడాల్సిందే.
Macho Starr @YoursGopichand in an interview with Favourite Director @tejagaru
FULL INTERVIEW TOMORROW ?#RamaBanam #RamabanamOnMay5 ?
@peoplemediafcy pic.twitter.com/R1cbizia3n
— Vamsi Kaka (@vamsikaka) April 25, 2023
