గోపిచంద్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా షూటింగ్ ఫిబ్రవరి 4నుండి ప్రారంభం కానుంది.
గోపిచంద్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా షూటింగ్ ఫిబ్రవరి 4నుండి ప్రారంభం కానుంది. తమిళ డైరెక్టర్ తిరు దర్శకత్వంలో, ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై, ప్రొడక్షన్ నెంబర్-18 గా రూపొందబోయే ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఇటీవలే జరిగాయి. కొద్ది రోజుల గ్యాప్ తర్వాత అనిల్ సుంకర ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. హీరోగా గొపీచంద్‌కిది 26వ సినిమా.
ఈ మూవీ కోసం ప్రస్తుతం మేకోవర్ అవుతున్నాడు గోపీ. గుబురు గెడ్డంతో కొత్త లుక్‌లో దర్శనమివ్వబోతున్నాడు. ఇంతకుముందు తిరు డైరెక్ట్ చేసిన ఇంద్రుడు, వేటాడు వెంటాడు వంటి సినిమాలు తెలుగులోనూ రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు గోపిచంద్ కోసం ఒక స్పై థ్రిల్లర్ స్టోరీని రెడీ చేసాడు తిరు. గోపిచంద్ పక్కన హీరోయిన్‌గా కన్నడ బ్యూటీ రష్మిక మండన్నా పేరు వినబడుతుంది.
ఫిబ్రవరి 4నుండి షూటింగ్ స్టార్ట్ చేసి, మే నెలలో రిలీజ్ చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు.విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న ఈ సినిమాకి మాటలు : అబ్బూరి రవి, ఫైట్స్ : సెల్వ.