రౌడీతో బాలీవుడ్ బ్యూటీ రొమాన్స్..

విజయ్ దేవరకొండ, పూరి జగన్నాధ్ దర్శకత్వంలో నటిస్తున్నపాన్ ఇండియా ఫిల్మ్‌లో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే కథానాయికగా నటిస్తోంది..

  • Publish Date - February 20, 2020 / 05:53 AM IST

విజయ్ దేవరకొండ, పూరి జగన్నాధ్ దర్శకత్వంలో నటిస్తున్నపాన్ ఇండియా ఫిల్మ్‌లో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే కథానాయికగా నటిస్తోంది..

విజయ్ దేవరకొండ, పూరి జగన్నాధ్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా రెగ్యులర్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. గురువారం నాడు సెట్‌లోకి హీరోయిన్ ఎంటర్ అయింది. ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ మూవీతో బాలీవుడ్‌‌కి పరిచయం అయిన అనన్య పాండే ఈ సినిమాలో రౌడీతో రొమాన్స్ చేయనుంది.

ఇటీవలే బాంబే షెడ్యూల్ పూర్తవగా తాజాగా హైదరాబాద్ షెడ్యూల్ ప్రారంభమైంది. పూరి కనెక్ట్స్ బ్యానర్‌పై పూరి జగన్నాథ్, చార్మిలతో కలిసి కరణ్ జోహార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. విజయ్ పక్కన అనన్య పాండే కథానాయికగా నటించనుందని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే.

అయితే ఈ పాన్ ఇండియా ఫిల్మ్‌లో అనన్య పాండేను కథానాయికగా ఎంపిక చేశారు. తాజా షెడ్యూల్‌లో అనన్య జాయిన్ అయింది. ఈ సందర్భంగా సెట్‌లో విజయ్, అనన్య, పూరి, చార్మి కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు.

విజయ్, అనన్య సీన్ కోసం రెడీ అవుతున్న పిక్స్ వైరల్ అవుతున్నాయి. ఈ అప్‌డేట్ #AnanyaPandayVijayDeverakonda హ్యాష్ ట్యాగ్‌తో ట్విట్టర్‌లో ఇండియా వైడ్ ట్రెండ్ అవుతోంది. అనన్య, విజయ్‌కి బాలీవుడ్‌కు వెల్‌కమ్ చెబుతూ ట్వీట్ చేయగా.. విజయ్, ‘తెలుగు, తమిళ్, కన్నడ అండ్ మలయాళ ఇండస్ట్రీలకు వెల్‌కమ్’ అంటూ బదులిచ్చాడు.

హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో రూపొందుతున్న ఈ చిత్రం కోసం విజయ్ థాయ్‌లాండ్‌లో మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ తీసుకున్నాడు. హీరోగా విజయ్‌కిది 10వ సినిమా, పూరికి 37వ సినిమా..

Read More>>డబ్బో రత్నాని క్యాలెండర్ కోసం ఐష్.. కైరా అద్వాణీ హాట్ ఫోజ్‌లు