మ్యాచో హీరో గోపీచంద్, మాస్ డైరెక్టర్ సంపత్ నంది కాంబినేషన్‌లో రూపొందనున్న సినిమాలో హీరోయిన్‌గా మిల్కీబ్యూటీ తమన్నా..
మ్యాచో హీరో గోపీచంద్, మాస్ డైరెక్టర్ సంపత్ నంది కాంబినేషన్‌లో ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ‘గౌతమ్ నంద’ తర్వాత వీరి కలయికలో ‘శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్’ బ్యానర్‌పై ‘ప్రొడక్షన్ నెం.3’ గా శ్రీనివాసా చిట్టూరి భారీ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. హీరోగా గోపిచంద్‌కు 28వ సినిమా ఇది. ఈ సినిమాలో హీరోయిన్‌గా మిల్కీబ్యూటీ తమన్నాను సెలెక్ట్ చేశారు.
తమన్నా గోపిచంద్‌తో నటించడం ఇదే తొలిసారి. సంపత్ నందితో ఆమెకిది మూడో సినిమా కావడం విశేషం. ఇంతకుముందు సంపత్ నంది దర్శకత్వంలో ‘రచ్చ’, ‘బెంగాల్ టైగర్’ సినిమాలు చేసింది తమన్నా. ఈ మూవీ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనుందని, తమన్నా క్రీడాకారిణిగా కనిపించనుందని తెలుస్తుంది. ఈ ఏడాది ‘ఎఫ్2’ తర్వాత ‘సైరా’లో నటించిన తమన్నా, ‘సరిలేరు నీకెవ్వరులో’ స్పెషల్ సాంగ్ చెయ్యనుంది.
Read Also : అధర్వ ‘బూమరాంగ్’ అక్టోబర్‌లో విడుదల..
కొంత గ్యాప్ తర్వాత గోపిచంద్ సినిమాలో పూర్తి స్థాయి కథానాయికగా నటిస్తుంది. పవన్ కుమార్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్న ఈ మూవీ త్వరలో ప్రారంభం కానుంది. తమిళ డైరెక్టర్ తిరుతో గోపిచంద్ చేస్తున్న ‘చాణక్య’ దసరా కానుకగా అక్టోబర్ 5న విడుదల కానుంది.