Suriya : హీరో సూర్య మరో బయోపిక్.. జై భీమ్ కాంబో!

ఏడాది కరుప్పు సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న సూర్య (Suriya) తాజాగా మరో ప్రయోగానికి శ్రీకారం చుట్టబోతున్నాడట

Gossip Garage Actor Suriya Next Movie With Jai Bhim Director

Suriya : ఏడాది కరుప్పు సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న సూర్య తాజాగా మరో ప్రయోగానికి శ్రీకారం చుట్టబోతున్నాడట. ఇప్పుడు పూర్తిగా భిన్నమైన కథను ఎంచుకున్నాడట. కమర్షియల్ ఎలిమెంట్స్‌కు కాస్త బ్రేక్ ఇచ్చి, ఈసారి రియల్ లైఫ్ స్టోరీతో కూడిన భావోద్వేగ కథను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నాడని టాక్.

ఈ మూవీ కోసం సూర్య తన లుక్, బాడీ లాంగ్వేజ్ పూర్తిగా మార్చుకుంటున్నాడని, ఇప్పటికే ప్రిపరేషన్స్‌లో బిజీగా ఉన్నాడని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. చెన్నైలో కేవలం ఒక రూపాయి తీసుకుని వైద్యం చేసి పేరు పొందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ కృష్ణ వరదాచారి తిరువెంగడం జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుందని ప్రచారం జోరుగా సాగుతోంది.

Anshu Reddy : బీచ్‌లో గుర్రం స‌వారీ చేస్తున్న సీరియ‌ల్ న‌టి.. ఫోటోలు వైర‌ల్

సామాన్య ప్రజలకు సేవ చేసిన గొప్ప వైద్యుడి కథను సూర్య తన నటనతో మరింత హృదయానికి హత్తుకునేలా చూపించబోతున్నాడని చెబుతున్నారు. ఈ బయోపిక్‌ను ప్రముఖ దర్శకుడు టీజీ జ్ఞానవేల్ తెరకెక్కించబోతున్నాడట. పాన్ ఇండియా రేంజ్‌లో ఈ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అధికారిక ప్రకటన రాకపోయినా, ఈ కాంబినేషన్ నిజమైతే జైభీమ్‌ లాంటి మరో బ్లాక్‌బస్టర్ హిట్‌ ఖాయమని అభిమానులు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు.