Anil Ravipudi : వెంకీతో అనిల్.. మల్టీస్టారర్ ప్లానింగ్.!
మరోసారి వెంకీతో ప్రయోగం చేయబోతున్నాడట అనిల్(Anil Ravipudi )
- Thota Vamshi Kumar
- Published On : February 9, 2026 / 02:30 PM IST
Gossip Garage Anil Ravipudi movie with multi starrer Venkatesh
Anil Ravipudi : అనిల్ రావిపూడి అంటే సంక్రాంతి.. సంక్రాంతి అంటే అనిల్ రావిపూడి. ప్రతి సంక్రాంతికి అనిల్ రావిపూడి డైరెక్షన్ నుంచి సినిమా రావాల్సిందే అన్నట్లుగా మారిపోయింది సీన్. ఈ సంక్రాంతికి మన శంకర వరప్రసాద్ మూవీతో హిట్ కొట్టిన అనిల్ రావిపూడి నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికి కూడా రెడీ అవుతున్నాడట. జూన్‌లోపు స్క్రిప్ట్ వర్క్ ఫినీష్ చేసి త్వరగా సెట్స్ మీదకు వెళ్లేందుకు డిస్కషన్స్ జరుగుతున్నాయట. మరోసారి వెంకీతో ప్రయోగం చేయబోతున్నాడట అనిల్. ఇది చిత్తూరు బ్యాక్ డ్రాప్‌లో జరిగే స్టోరీ అని టాక్ నడుస్తుంది.
అనిల్ రావిపూడి, వెంకీ కాంబోలో రాబోయే మూవీలో నటుడు ఫహద్ ఫాజిల్ కూడా నటించబోతున్నాడని టాక్. వెంకీ, ఫహద్ ఫాజిల్ ఇద్దరు బావా బామర్ధులుగా స్క్రీన్ మీద ఆకట్టుకోబోతున్నారట. ఈ సినిమా 2027 జనవరి 12న సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట అనిల్.
Kiran Abbavaram : హీరోయిన్ తో కలిసి చెన్నై లోకల్ ట్రైన్ లో కిరణ్ అబ్బవరం.. ఫోటోలు వైరల్..
ఇక పండగకు వస్తున్నాం అనే టైటిల్ కూడా పరిశీలనలో ఉందంటున్నారు. అయితే ఫహద్ ఫాజిల్ రెమ్యూనరేషన్ బాగానే డిమాండ్ చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక ఈ సినిమాను కూడా సాహు గారపాటి నిర్మాతగా, మరో ప్రొడ్యూసర్‌గా సురేష్ బాబు నిర్మాణంలో రాబోతోందట. అయితే రానా కూడా ఓ స్పెషల్ రోల్ చెయ్యబోతున్నాడనే టాక్ నడుస్తుంది. మరో వారంలో అనిల్ రావిపూడి ఫుల్ క్లారిటీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది.
