×
Ad

Chiranjeevi vs Chinmayi : క్యాస్టింగ్ కౌచ్ లొల్లి.. చిరంజీవి Vs చిన్మయి

ఈ సెన్సెటీవ్‌ అంశంపై మెగాస్టార్ చిరంజీవి చేసిన కొన్ని కామెంట్స్, సింగర్ చిన్మయ్‌ ఇచ్చిన రిప్లై (Chiranjeevi vs Chinmayi) ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

Gossip Garage Casting Couch Chiranjeevi Vs Singer Chinmayi

Chiranjeevi vs Chinmayi : సినిమా ఇండస్ట్రీకి క్యాస్టింగ్ కౌచ్ అనేది ఒక చెరిగిపోని మచ్చ లాంటిది. అప్పుడప్పుడూ ఈ టాపిక్ తెరపైకి రావడం, రచ్చ..రచ్చ జరగడం కామన్ అయిపోయింది. లేటెస్ట్‌గా ఈ సెన్సెటీవ్‌ అంశంపై మెగాస్టార్ చిరంజీవి చేసిన కొన్ని కామెంట్స్, సింగర్ చిన్మయ్‌ ఇచ్చిన రిప్లై ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

రీసెంట్‌గా జరిగిన ఒక సినిమా ఈవెంట్‌లో చిరంజీవి క్యాస్టింగ్ కౌచ్ గురించి ప్రస్తావించారు. ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ లాంటిదేం లేదు. అది పూర్తిగా వ్యక్తిగతమైన విషయం. ఇండస్ట్రీ ఒక అద్దం లాంటిది..మనం ఎలా ఉంటే అది అలానే రిఫ్లెక్ట్ అవుతుందంటూ చెప్పుకొచ్చారు మెగాస్టార్. ఈ మాటలను ప్రముఖ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి తప్పుబట్టింది. చిరు చెప్పింది వాస్తవానికి చాలా దూరంగా ఉందని, ఇండస్ట్రీలో చీకటి కోణం ఇంకా బలంగానే ఉందని తేల్చి చెప్పింది.

Mahesh Babu : వామ్మో అప్పట్లోనే కోటి రూపాయలు పెట్టి.. 300 మందితో.. మహేష్ సినిమా కోసం..

కమిట్‌మెంట్ అంటే పని పట్ల అంకిత భావం కాదని, పరోక్షంగా సెక్సువల్ ఫేవర్స్ అడుగుతున్నారని బ్లాస్టింగ్‌ కామెంట్స్ చేసింది. కొత్తగా ఇండస్ట్రీకి వచ్చే అమ్మాయిల దగ్గర, పవర్‌లో ఉన్న మగవాళ్లు తమకు ఈ సుఖం దక్కాల్సిందే అని రూల్స్ పెడుతున్నారని, ఇది హక్కుగా భావిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది చిన్మయి.

చిరంజీవి కామెంట్స్‌పై టాలీవుడ్‌లో పెద్ద దుమారమే లేస్తోంది. అసలు క్యాస్టింగ్ కౌచ్ లేదని మెగాస్టార్ చిరంజీవి ఎలా చెబుతారంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇండస్ట్రీ పెద్దగా చెప్పబడుతున్న ఆయన అసలు సమస్యే లేదన్నట్లు మాట్లాడటం కరెక్ట్ కాదంటున్నారు చాలా మంది. క్యాస్టింగ్ కౌచ్ సమస్య వచ్చేది అప్‌ కమింగ్‌ యాక్ట్రస్‌కు..ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్‌ లేనివాళ్లకు అన్న విషయాన్ని మర్చిపోవద్దంటున్నారు.

చిన్మయి చెప్పేది చాలా కరెక్ట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. చిరంజీవి కూతురు సుస్మిత, అశ్విని దత్ కూతుళ్లు ప్రియాంక, స్వప్న, నాగార్జున మేన కోడలు సుప్రియలు పెద్ద కుటుంబం నుంచి వచ్చిన వారు కాబట్టి వారికి ఎలాంటి సమస్యలు రావని.. క్యాస్టింగ్ కౌచ్ సమస్య సామాన్య లేడీ ఆర్టిస్ట్‌లు, ఇతర క్రాఫ్ట్స్‌లో పనిచేసే మహిళలకు ఎదరవుతున్నాయని చెప్పుకొస్తున్నారు. మరోసారి టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్ అంశం తెరపైకి రావటంతో ఇది ఎక్కడదాక పోతుందోనన్న ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.