Prabhas : ఫ్యాన్స్ కు డార్లింగ్ బిగ్ సర్‌ప్రైజ్ ?

ప్రభాస్ బర్త్‌డే (Prabhas ) సందర్భంగా అక్టోబర్ 23న ఫ్యాన్స్‌కు బిగ్ సర్‌ప్రైజ్‌లు ప్లాన్ చేస్తున్నారట మేకర్స్.

Gossip garage Darling Prabhas Big surprise For Fans

Prabhas : ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా అక్టోబర్ 23న ఫ్యాన్స్‌కు బిగ్ సర్‌ప్రైజ్‌లు ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. ప్రస్తుతం ప్రభాస్ చేస్తున్న ఫౌజీ, స్పిరిట్, కల్కి-2 సినిమాలపై భారీ అంచనాలు ఉండటంతో.. ఆయన బర్త్‌డే రోజు అన్ని ప్రాజెక్టుల నుంచి కీలక అప్‌డేట్స్ వచ్చే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది. ఫౌజీ నుంచి ప్రభాస్ కొత్త లుక్ లేదా స్పెషల్ టీజర్ రిలీజ్ చేస్తారని సోషల్ మీడియా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

ఇక అన్నింటికి మించి పోలీస్ లుక్‌లో ప్రభాస్‌ ఎలా ఉంటాడో చూడాలని ఎగ్జైట్‌మెంట్‌తో ఉన్నారు ఫ్యాన్స్. అందుకే స్పిరిట్ మూవీ నుంచి కొత్త టీజర్ వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు. కల్కి-2 నుంచి కూడా స్పెషల్ అనౌన్స్‌మెంట్ వచ్చే అవకాశం ఉందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

Actress Hari Teja : బ్లూ క‌ల‌ర్ శారీలో సాంప్ర‌దాయంగా.. న‌టి హ‌రితేజ ఫోటోలు వైర‌ల్..

ఒకే రోజు మూడు సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్ వస్తే ప్రభాస్ అభిమానులకు అది నిజంగానే ట్రిపుల్ ధమాకా అవుతుంది. అయితే ఏ సినిమా నుంచి ఎలాంటి అప్‌డేట్ వస్తుందనే విషయంలో ఇప్పటివరకు అధికారిక ప్రకటన లేదు. దీంతో అక్టోబర్ 23న ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా మేకర్స్ ఏం సర్‌ప్రైజ్ ఇవ్వబోతున్నారనే ఆసక్తి ఫ్యాన్స్‌లో పెరుగుతోంది.

ఫౌజీ, స్పిరిట్, కల్కి-2లో ఏ సినిమా ముందుగా బర్త్‌డే ట్రీట్ ఇవ్వబోతోంది? మూడు సినిమాల నుంచి అప్‌డేట్స్ వస్తాయా.? లేక ఒకట్రెండు సినిమాలకు సంబంధించిన టీజర్, లుక్‌ను రిలీజ్ చేస్తారా.? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.