Nani : విలన్ గా నాని..!

టాలీవుడ్ ప్రేక్ష‌కుల‌కు నేచుర‌ల్ స్టార్ నాని (Nani) గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు.

Gossip Garage Hero Nani as a Villain

Nani : టాలీవుడ్ ప్రేక్ష‌కుల‌కు నేచుర‌ల్ స్టార్ నాని గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. త‌న కెరీర్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు ఎక్కువ‌గా సాఫ్ట్ క్యారెక్ట‌ర్లు చేసిన‌ప్ప‌టికి కూడా దసరా మూవీ నుంచి మాస్ రూట్‌లోకి కూడా వస్తున్నాడు. శ్రీకాంత్ డైరెక్షన్‌లో త్వరలో రాబోతున్న ప్యారడైజ్‌ మీద అభిమానుల్లో భారీ అంచ‌నాలే ఉన్నాయి. ఇదిలా ఉంటే.. నాని కెరీర్‌లోనే బిగ్గెస్ట్ రిస్క్ తీసుకోబోతున్నాడనే టాక్ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది.

ఓ కొత్త సినిమాలో.. పూర్తిగా సైకో షేడ్స్ ఉన్న నెగటివ్ పాత్రకు నాని గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. మానసికంగా డిస్టర్బ్‌ అయి.. క్రూరంగా ప్రవర్తించే కేరక్టర్‌లో నాని కనిపించబోతున్నాడని టాక్‌. ఈ పాత్ర కోసం ప్రత్యేకంగా బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ ఉంటుందని తెలుస్తోంది. ఈ మూవీ చేస్తే తన కెరీర్‌లోనే కొత్త ఛాప్టర్ ఓపెన్ అవుతుందని.. ఆ కేరక్టర్‌కు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చాడట నాని.

Vithika Sheru : అదేమిటో నా య‌ద వ‌రించింది తీయ‌గా.. వితికా షేరు ఫోటోలు వైర‌ల్..

సినిమాను ఓ కొత్త దర్శకుడు తెరకెక్కిస్తుండగా.. ఈ పాత్రను చాలా డార్క్‌గా, రియలిస్టిక్‌గా ప్లాన్ చేస్తున్నాడట. క్లైమాక్స్‌లో నాని చేసే యాక్షన్, ఎమోషనల్ షేడ్స్.. ప్రేక్షకులను షాక్‌కు గురి చేస్తాయని టాక్‌. ఇలాంటి కేరక్టర్ పడితో నాని కెరీర్‌లో గేమ్ ఛేంజర్ అని కొందరు అంటుంటే.. అసలు విలన్‌గా నాని ఎలా ఉంటాడు అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.