Varanasi : వారణాసిపై ధురంధర్ 2 ఎఫెక్ట్..

ఒకే పార్ట్‌గా కాకుండా వారణాసి (Varanasi) మూవీని రెండు భాగాలుగా తీసుకురావాలని జక్కన్న ప్లాన్ చేస్తున్నాడనే చర్చ నడుస్తోంది.

Gossip Garage Is Dhurandhar 2 movie effect on Varanasi movie

Varanasi : రణవీర్ హీరోగా, ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం దురంధర్‌ 2. నాలుగు గంటల ఎపిక్ రన్‌టైమ్‌తో విడుదలై ప్రపంచవ్యాప్తంగా భారీ కలెక్షన్స్‌తో దూసుకుపోతోంది. అన్ని రికార్డులను బద్దలు కొడుతోంది. నార్త్ అమెరికాలో బాహుబలి 2 రికార్డును కూడా మించి ఓపెనింగ్ వీకెండ్‌లోనే 150మిలియన్ డాలర్లు క్రాస్ చేయడం ఇండస్ట్రీని షాక్‌కు గురి చేసింది.

ఈ సక్సెస్ చూసి నెక్ట్స్‌ ప్రాజెక్ట్ విషయంలో జక్కన్న తన ఆలోచన మార్చుకున్నాడ‌నే టాక్ వినిపిస్తోంది. ఒకే పార్ట్‌గా కాకుండా వారణాసి (Varanasi) మూవీని రెండు భాగాలుగా తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నాడనే చర్చ నడుస్తోంది. దురంధర్‌ 2 భారీ స్కేల్‌, విజువల్ ఎఫెక్ట్స్, స్టోరీ టెల్లింగ్ స్టైల్ చూసి ఫిదా అయిన రాజమౌలి తన వెయ్యి కోట్ల బడ్జెట్ సినిమా కంటెంట్‌ను ఒకే భాగంలో కుదించకుండా గ్రాండ్ నెరేటివ్‌గా రెండు పార్టులుగా మార్చి ప్రేక్షకులకు ఎపిక్ అనుభవం అందించాలని భావిస్తున్నాడట.

Shweta Basu Prasad : కొత్త బంగారు లోకం హీరోయిన్.. ఇప్పుడెలా ఉందో చూడండి.. బోల్డ్ ఫొటోలతో వైరల్..

దీనికోసం తన టీమ్‌లోని సీనియర్ స్క్రిప్ట్ రైటర్లతో జక్కన్న మీటింగ్స్ కూడా స్టార్ట్ చేశాడని టాక్‌. ఇది రాజమౌళి స్టైల్‌కు కొత్త ట్విస్ట్ అనే డిస్కషన్ నడుస్తోంది. గతంలో బాహుబలిని రెండు భాగాలుగా తీసుకెళ్లిన అనుభవం ఉన్నా.. ధురంధర్ 2లాంటి హైప్ చూసి మరింత అప్‌గ్రేడ్ చేసుకోవాలని డిసైడ్ కావడం ఫస్ట్ టైమ్‌.

ఓవరాల్‌గా ధురంధర్ 2 సక్సెస్.రాజమౌళిలాంటి మెగా డైరెక్టర్లపై కూడా కొత్త టార్గెట్ పెట్టినట్లు అయిందని ఫ్యాన్స్ డిస్కస్‌ చేసుకుంటున్నారు. దీంతో వారణాసి మూవీ ఎలా ఉండబోతోంది. రెండు భాగాలుగా ఎలా డివైడ్ చేస్తారంటూ.. ఫ్యాన్స్‌లో కొత్త చర్చ మొదలైంది.