Peddi : పెద్ది ప్రీరిలీజ్ ఈవెంట్ అక్కడేనా?
రామ్‌చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న సినిమా పెద్ది (Peddi).
- Thota Vamshi Kumar
- Published on- May 7, 2026 / 09:29 AM IST
Gossip Garage is peddi pre release event in hyderabad
Peddi : రామ్‌చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న సినిమా పెద్ది. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన సాంగ్స్ మూవీపై ఓ రేంజ్‌లో బజ్ ను క్రియేట్ చేయగా..రిలీజ్ డేట్ దగ్గర పడుతున్నా కొద్దీ పెద్ది సినిమాపై హైప్ డబుల్ అవుతోంది. స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్ర ప్రమోషన్స్‌పై ఫోకస్ పెట్టారు మేకర్స్.
ప్రీరిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించి.. దునియా దృష్టిని ఆకట్టుకునే ప్లాన్ చేస్తున్నారట. జూన్ 2న పెద్ది సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ జరగబోతుందనే టాక్ వినిపిస్తోంది. ప్రీరిలీజ్ ఈవెంట్‌పై అధికారిక ప్రకటన రాకపోయినా, సోషల్ మీడియాలో మాత్రం ఇప్పటికే భారీ అంచనాలు మొదలయ్యాయి. విలేజ్ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతుండటంతో..అదే థీమ్‌కు తగ్గట్టుగా ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ప్లాన్ చేస్తున్నారని టాక్. గ్రామీణ క్రీడల ఎలిమెంట్స్‌ను స్టేజ్ డిజైన్‌లో ప్రతిబింబించేలా, ఫ్యాన్స్‌కు ఒక ప్రత్యేక అనుభూతి కలిగించేలా ఈవెంట్ నిర్వహిస్తారని అంటున్నారు.
ఇక పెద్ది ప్రీరిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించాలని భావిస్తున్నారట. LB స్టేడియం వేదికగా ఈ భారీ ఈవెంట్‌ను ఆర్గనైజ్ చేసేందుకు కసరత్తు జరుగుతోందట. భారీ సంఖ్యలో అభిమానులు హాజరవుతారన్న అంచనాల నేపథ్యంలో.. ఎల్బీస్టేడియం అయితే బాగుంటుందని వేదికను ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తోంది. గతంలో కూడా పెద్ద ఈవెంట్లు ఇక్కడ సక్సెస్‌ఫుల్‌గా నిర్వహించడంతో పెద్ది టీమ్ కూడా మరింత గ్రాండ్‌గా ప్లాన్ చేస్తున్నట్టు ఇన్‌సైడ్ టాక్. ప్రీరిలీజ్ ఈవెంట్‌పై అధికారిక ప్రకటన కోసం రామ్‌చరణ్ ఫ్యాన్స్ ఎదురు చూస్తుండగా, ఇప్పటికే డేట్, వెన్యూను ఫిక్స్ అంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం నడుస్తోంది.
