×
Ad

Pawan Kalyan : రాజమౌళి నెక్స్ట్ మూవీ పవన్ కల్యాణ్‌తో..?

పవర్ స్టార్ Pawan Kalyan సినిమా వచ్చినా.. దర్శక ధీరుడి మూవీ రిలీజ్‌ అయినా ఫ్యాన్స్‌కు పండగే

Gossip Garage Is Rajamouli next movie with Pawan Kalyan

Pawan Kalyan : పవర్ స్టార్ సినిమా వచ్చినా.. దర్శక ధీరుడి మూవీ రిలీజ్‌ అయినా ఫ్యాన్స్‌కు పండగే. అలాంటిది ఆ ఇద్దరి కాంబినేషన్‌లో మూవీ వస్తే.. నెక్స్ట్‌ లెవల్. కాకపోతే ఇప్పటివరకు వాళ్లిద్దరు కలిసి సినిమా చేయలేదు. ఫస్ట్‌ టైమ్‌ వాళ్లిద్దరి కాంబినేషన్‌లో భారీ ప్రాజెక్టుకు ప్లాన్ చేస్తున్నారట.

రాజమౌళితో, పవన్‌ సినిమా చేసే అవకాశాలు చాలా ఉన్నాయంటున్నారు. రాజమౌళి డైరెక్షన్‌లో మూవీ చేయాలని పవన్.. పవన్‌ హీరోగా సినిమా తీయాలని రాజమౌళి ఇద్దరు తెగ ఇంట్రెస్టింగ్‌గా ఉన్నారట. రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో పాన్ వరల్డ్ మూవీ చేస్తున్నాడు. ఆగస్ట్‌లో మహేష్ బాబు పుట్టినరోజున టీజర్ రిలీజ్ చేసే ప్లాన్‌లో ఉన్నారు. ఎట్టి పరిస్థిత్థుల్లోనూ 2027 ఏప్రిల్ 7న సినిమా రిలీజ్ చేయాలని కూడా డిసైడ్ అయ్యారట.

వారణాసి మూవీ తర్వాత రాజమౌళి ఎవరితో సినిమా చేస్తాడనేది ఇప్పటికీ క్లారిటీ లేదు. మామూలుగా అయితే రాజమౌళి నెక్స్ట్‌ ప్రాజెక్ట్‌పై లీకులు వస్తుంటాయి. ఈ క్రమంలోనే మహేష్‌ మూవీ తర్వాత..పవన్‌తో సినిమాను తెరకెక్కించేందుకు జక్కన్న ప్లాన్ చేస్తున్నాడట. పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ఆల్రెడీ రిలీజ్‌కు రెడీ అవుతోంది.

ఆ తర్వాత సురేందర్‌రెడ్డితో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ మూవీని వచ్చే సంక్రాంతకి రిలీజ్ చేసే ప్లాన్‌లో ఉన్నారని టాక్. తర్వాత పవన్.. రాజమౌళి సినిమా స్టార్ట్ చేసే అవకాశముందంటున్నారు. అన్నీ కుదరితే పవన్, జక్కన్న మూవీపై టైమ్‌ చూసి ఓ ప్రకటన రిలీజ్ చేసే ఛాన్సెస్ కూడా దగ్గరలోనే ఉన్నాయంటూ గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి. వారణాసి సినిమా రిలీజ్‌కు ముందే పవర్‌ స్టార్‌తో దర్శకధీరుడు చేయబోయే మూవీపై క్లారిటీ వచ్చే అవకాశం దీని గురించి వచ్చే అవకాశాలున్నాయట. వీరిద్దరి సినిమా ఫిక్స్ అయి తెరకెక్కితే మాత్రం బాక్సాఫీస్ షేక్ అవ్వాల్సిందే.