Mega Multi Starrer : మెగా మల్టీ స్టారర్ మూవీ రాబోతోందా..?
మెగా ఫ్యామిలీ హీరోల (Mega Multi Starer) క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంటుంది.
- Thota Vamshi Kumar
- Updated on- April 11, 2026 / 03:22 PM IST
Mega Family Multi Starrer Movie
Mega Multi Starrer : మెగా ఫ్యామిలీ హీరోల క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంటుంది. ఒక్కరు స్క్రీన్ మీద కనిపిస్తేనే.. ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతారు. అలాంటిది మెగా ఫ్యామిలీ హీరోలంతా ఒకేసారి, ఒకే సినిమాలో కనిపిస్తే ఎలా ఉంటుంది. ఊహించుకోడానికే క్రేజీగా, థ్రిల్లింగ్‌గా ఉంది కదా.. ఇప్పుడు ఇలాంటి గాసిపే ఒకటి వైరల్ అవుతోంది.
మెగాస్టార్ చిరంజీవి ఒక స్పెషల్ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నాడని, అందులో తన ఫ్యామిలీ హీరోలు భాగం అవుతారని, టాలీవుడ్ సర్కిల్స్‌లో ఓ గాసిప్ హాట్‌టాపిక్‌గా మారింది. భారీ స్కేల్‌లో ఈ మల్టీస్టారర్ తీయాలనే ప్లాన్ ఉందని టాక్. ఐతే మెగా మల్టీస్టారర్‌కు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
*రాజ్ తరుణ్, ప్రేమిస్తే భరత్ మల్టీస్టారర్.. రా & రస్టిక్ సినిమా.. ట్రైజర్ అదిరింది..
మన శంకర వరప్రసాద్ గారు సక్సెస్ తర్వాత చిరంజీవి ప్రస్తుతం బాబీ డైరెక్షన్‌లో మూవీకి రెడీ అవుతున్నారు. విశ్వంభరలాంటి సోలో ప్రాజెక్ట్‌లోనూ బిజీగా ఉన్నారు. ఇక అటు రాంచరణ్, బన్నీ కూడా తమ సొంత ప్రాజెక్ట్‌ల్లో నిమగ్నమై ఉన్నారు. దీంతో మెగా ఫ్యామిలీ మల్టీస్టారర్ అనేది గాసిప్ మాత్రమేనా లేదంటే ఏదైనా ప్లాన్ జరుగుతుందా అనే దానిపై ప్రస్తుతానికి క్లారిటీ లేదు. చిరు, రాంచరణ్, బన్నీతో పాటు మెగా హీరోలందరూ ఒకే స్క్రీన్ మీద కనిపిస్తే ఎలా ఉంటుందనేది మెగా ఫ్యాన్స్‌కు ఓ కల. అంటే అన్నారు కానీ ఆ ఊహ ఎంతబాగుందో అనుకుంటూ గాసిప్‌ను వైరల్ చేస్తున్నారు అభిమానులు.
