Ustaad Bhagath Singh : ఉస్తాద్ రిజల్ట్ ఎఫెక్ట్ అదేనా..?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా రాశి ఖన్నా, శ్రీలీల హీరోయిన్స్‌గా దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించిన మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagath Singh) మిక్స్‌డ్‌ టాక్ తెచ్చుకుంది.

Gossip Garage is Ustaad Bhagath Singh result effect to Harish Shankar

Ustaad Bhagath Singh : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా రాశి ఖన్నా, శ్రీలీల హీరోయిన్స్‌గా దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించిన మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ మిక్స్‌డ్‌ టాక్ తెచ్చుకుంది. పవన్ ఫ్యాన్స్ ఎంతో ఎగ్జైట్‌మెంట్‌తో వెయిట్ చేసిన సినిమా కాస్త.. అనుకున్న రేంజ్‌లో మెప్పించకపోవడంతో అభిమానులతో కూడా ఫ్యాన్స్‌ కూడా కాస్త డిసప్పాయింట్ అయ్యారు.

బాక్సాఫీస్‌ దగ్గర కూడా ఆశించిన కలెక్షన్స్‌ రాకపోవడంతో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్టు టాలీవుడ్‌లో టాక్ నడుస్తోంది. హీరో-డైరెక్టర్ కాంబినేషన్‌పై పవన్ భారీ అంచనాలు పెట్టుకున్నా, ఆశించిన ఫలితం రాకపోవడం పవన్‌ను నిరాశపరిచిందని సోర్సెస్ చెబుతున్నాయి.

Anchor lasya : శ్రీరామ న‌వ‌మి స్పెష‌ల్.. నిండైన చీర‌క‌ట్టులో యాంక‌ర్ లాస్య‌.. ఫోటోలు వైర‌ల్‌..

ఉస్తాద్‌ భగత్‌సింగ్‌ రిజల్ట్‌ తర్వాత హరీశ్‌ శంకర్ నెక్స్ట్ చేయబోయే ప్రాజెక్టుపై డైలమా ఏర్పడిందట. హరీశ్‌ శంకర్ తన తదుపరి సినిమాను ఓ ప్రముఖ బ్యానర్ కింద డైరెక్ట్ చేయబోతుండగా ఆ ప్రాజెక్ట్ కూడా క్యాన్సల్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. ఉస్తాద్‌ ఎఫెక్ట్‌ హరీశ్‌ శంకర్‌ నెక్స్ట్‌ చేయబోయే ప్రాజెక్టుపై పడిందన్న టాక్ టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

నిజంగానే పవన్ డిసప్పాయింట్ అయ్యారా.? హరీశ్‌ శంకర్‌పై అసంతృప్తి వ్యక్తం చేశారా.? ఆయన తర్వాతి సినిమాపై ఉస్తాద్‌ ఎఫెక్ట్ పడేందా లేదా అనేది అయితే ఔట్‌ రౌట్‌ క్లారిటీ లేదు. ఇండస్ట్రీలో నడుస్తున్న ఇన్‌సైడ్‌ టాక్‌తోనే రకరకాల గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి.