Vijay Deverakonda-Nani : విజయ్ దేవరకొండ, నాని మల్టీస్టారర్ ప్లాన్.!?

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, న్యాచురల్‌ స్టార్‌ నాని కలిసి (Vijay Deverakonda-Nani)ఒక మల్టీస్టారర్ చేయబోతున్నారన్న టాక్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌ అవుతోంది.

Gossip Garage is Vijay Deverakonda Nani multistarrer

Vijay Deverakonda-Nani :టాలీవుడ్‌లో మరో క్రేజీ న్యూస్‌ ఇంట్రెస్టింగ్‌గా మారింది. రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, న్యాచురల్‌ స్టార్‌ నాని కలిసి ఒక మల్టీస్టారర్ చేయబోతున్నారన్న టాక్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌ అవుతోంది. ప్రస్తుతం ఇద్దరూ తమ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నప్పటికీ, ఒక మంచి స్టోరీ కోసం వెయిట్ చేస్తున్నారట.

నాని ఇప్పటికే హీరోగా నటిస్తూ, మరోవైపు ప్రొడ్యూసర్‌గా కూడా సినిమాలు చేస్తూ ఫుల్ ఫామ్‌లో ఉన్నాడు. విజయ్ దేవరకొండ కూడా తన తదుపరి సినిమాలతో కమ్‌బ్యాక్‌కు రెడీ అవుతున్న టైమ్‌లో, ఈ కాంబినేషన్ వస్తే మాత్రం అది పక్కా బాక్సాఫీస్ సెన్సేషన్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Ashu reddy: రూ.9 కోట్ల మోసం.. స్పందించిన అషు రెడ్డి.. తప్పుడు వార్తలు రాస్తే జైలుకే అంటూ వార్నింగ్

మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌లో నాని, విజయ్‌ దేవరకొండ మల్టీస్టారర్ అంటూ ప్రచారం జరుగుతుండటం మరింత ఆసక్తిని పెంచుతోంది. భారీ బడ్జెట్‌తో, ఇద్దరి ఇమేజ్‌కు తగ్గట్టుగా పవర్‌ఫుల్ స్క్రిప్ట్ రెడీ అవుతున్నట్లు గాసిప్ వినిపిస్తోంది. ఇద్దరి పాత్రలకు ఈక్వల్ ప్రయారిటీ ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. అయితే ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు కానీ, ఈ కాంబో నిజమైతే టాలీవుడ్‌లో మరో రేంజ్ మల్టీస్టారర్‌గా నిలిచే అవకాశాలు లేకపోలేదంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు.

నాని, విజయ్ దేవరకొండ కలిసి ఎవడే సుబ్రహ్మణ్యం మూవీలో నటించారు. అందులో నాని ప్రధాన పాత్ర పోషించగా, విజయ్ దేవరకొండ కీలక పాత్రలో కనిపించారు.