God Of War : డైలమాలో గాడ్ ఆఫ్ వార్..!?
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో రాబోతున్న గాడ్ ఆఫ్ వార్ (God Of War )మూవీ సందిగ్ధంలో పడిందని టాలీవుడ్ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది.
- Thota Vamshi Kumar
- Published on- May 23, 2026 / 10:22 AM IST
Gossip Garage Jr NTR Trivikram God Of War
God Of War : జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో రాబోతున్న గాడ్ ఆఫ్ వార్ మూవీ సందిగ్ధంలో పడిందని టాలీవుడ్ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది. గుంటూరు కారం తర్వాత అల్లుఅర్జున్ కోసం కార్తికేయ స్వామిపై త్రివిక్రమ్ కథ సిద్ధం చేసి, అనౌన్స్‌మెంట్ వీడియో కూడా విడుదల చేశారు. అయితే అల్లుఅర్జున్ అట్లీ సినిమాతో బిజీ అవ్వడంతో, ఈ కథ జూనియర్ ఎన్టీఆర్ దగ్గరికి వెళ్లినట్లు వార్తలు వచ్చాయి.
నిర్మాత నాగవంశీ కూడా తారక్-త్రివిక్రమ్ ప్రాజెక్ట్‌పై హింట్ ఇచ్చాడు. కానీ ఇప్పటివరకు ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్‌పై అధికారిక ప్రకటన ఏం రాలేదు. మే 20న ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి అప్‌డేట్ ఇస్తారని ఫ్యాన్స్ ఎదురు చూశారు. అయితే ఆ రోజు ఎలాంటి అప్‌డేట్ రాకపోవడంతో కొత్త డౌట్స్ స్టార్ట్ అయ్యాయి. త్రివిక్రమ్ తాజా చిత్రం ఆదర్శ కుటుంబం రిజల్ట్ ఎలా ఉంటుందో చూసి గాడ్ ఆఫ్ వార్‌పై ఎన్టీఆర్ ఫైనల్ డిసిషన్ తీసుకునే అవకాశం ఉందట. అందుకే గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండా బర్త్‌డే అప్‌డేట్ ఇవ్వలేదని ఇన్‌సైడ్ టాక్ నడుస్తోంది.
Priya Hegde : చీరలో మెరిసిపోతున్న సీరియల్ స్టార్.. ప్రియా హెగ్డే ఫోటోలు వైరల్
ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన అరవింద సమేత మంచి సక్సెస్ కొట్టింది. మరోసారి ఈ హిట్ కాంబినేషన్ రిపీట్ అవుతుందన్న టాక్‌తో ఫ్యాన్స్‌లో భారీ ఎక్స్‌పెక్టేషన్స్ కొనసాగాయి. కానీ ఇప్పుడు త్రివిక్రమ్ సైడ్ నుంచి అనౌన్స్‌మెంట్ వీడియో, పనులు జరుగుతున్నా..ఎన్టీఆర్ నుంచి ఒక్క మాట కూడా రావడం లేదు. బర్త్‌డే సందర్భంగా ఎలాంటి అప్‌డేట్ ఇవ్వకపోవడానికి చాలా లెక్కలు ఉన్నాయని అంటున్నారు. ఆదర్శ కుటుంబం రిజల్ట్‌ను బట్టి ఎన్టీఆర్ గాడ్ ఆఫ్ వార్ ప్రాజెక్ట్‌ను కన్సిడర్ చేసే చాన్స్ ఉందని టాక్. ప్రస్తుతం డ్రాగన్‌పై ఫోకస్ చేస్తున్న ఎన్టీఆర్..గాడ్ ఆఫ్ వార్‌పై ఎటూ తేల్చుకోలేకపోతున్నారని చెబుతున్నారు.
