Mahesh Babu : మహేష్, సుక్కు కాంబో సెట్టా.?
సూపర్‌స్టార్ మహేష్ బాబు(Mahesh Babu), క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌పై ఎప్పటినుంచో ఆసక్తికరమైన చర్చ ఉంది.
- Thota Vamshi Kumar
- Published on- October 11, 2026 / 09:40 AM IST
Gossip Garage Mahesh Babu and Sukumar Project
Mahesh Babu : సూపర్‌స్టార్ మహేష్ బాబు, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌పై ఎప్పటినుంచో ఆసక్తికరమైన చర్చ ఉంది. గతంలోనే వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా రాబోతున్నట్లు టాక్ వినిపించింది. వన్ నేనొక్కడినే సినిమా తర్వాత సెకండ్ ప్రాజెక్టు చేసేందుకు సుక్కు ఓ స్టోరీ చెబితే అది మహేష్‌కు అప్పట్లో నచ్చలేదట. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సుకుమార్ చెప్పిన కథపై మహేష్ ఆసక్తి చూపలేదని, ఆ తర్వాత అదే స్టోరీతో అల్లు అర్జున్ హీరోగా పుష్ప-1, పుష్ప-2 సినిమాలు తెరకెక్కాయని అప్పట్లో టాక్ వినిపించింది.
ఆ తర్వాత ఈ ఇద్దరూ కలిసి మరో సినిమా చేయకపోవడంతో, వీరి కాంబినేషన్ మళ్లీ ఎప్పుడు సెట్ అవుతుందనే ఆసక్తి అభిమానుల్లో కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు మరోసారి మహేష్ బాబు, సుకుమార్ కలిసి పనిచేయబోతున్నారనే వార్తలు తెరపైకి రావడంతో ఈ కాంబినేషన్‌పై చర్చ మొదలైంది.
Rashi Singh : చీరకట్టులో ముద్దుగా.. రాశిసింగ్ క్యూట్ ఫోటోలు..
అయితే గతంలోనే కథ విషయంలో అభిప్రాయాలు కలవలేదనే ప్రచారం ఉండటంతో, ఈసారి ఇద్దరి ఆలోచనలు ఒకే దారిలో సాగుతాయా.? అనేది ఆసక్తికరంగా మారింది. మహేష్ బాబు తన ఇమేజ్, స్టోరీ సెలక్షన్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకుంటారు. సుకుమార్ తనదైన స్టైల్, డిఫరెంట్ క్యారెక్టరైజేషన్‌తో సినిమాలను తెరకెక్కిస్తుంటారు.
ఇలాంటి ఇద్దరు క్రియేటివ్ పర్సనాలిటీస్ కలిసి పనిచేయాలంటే కథ, స్క్రీన్‌ప్లే, పాత్రల విషయంలో ఏకాభిప్రాయం కుదరాల్సిందే. అయితే వీరిద్దరి కాంబినేషన్‌పై వస్తున్న వార్తలు ప్రస్తుతం ప్రచార స్థాయిలోనే ఉన్న నేపథ్యంలో, సినిమా నిజంగా ఖరారైందా.? అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుంది.? అన్నది ఆసక్తికరంగా మారింది.
