Mahesh Babu : వారణాసికి బ్రేక్.! నెక్స్ట్ ప్రాజెక్టుపై మ‌హేశ్‌ ఫోకస్.?

మహేష్ బాబు (Mahesh Babu )వారణాసికి బ్రేక్ ఇచ్చి మరో స్పెషల్ ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని టాలీవుడ్‌లో ఇన్‌సైడ్ టాక్ నడుస్తోంది.

Gossip Garage Mahesh Babu Varanasi break focus on next movie

Mahesh Babu : ప్రిన్స్‌ మహేష్ బాబు తన బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ వారణాసికి బ్రేక్ ఇచ్చి మరో స్పెషల్ ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని టాలీవుడ్‌లో ఇన్‌సైడ్ టాక్ నడుస్తోంది. వారణాసి కోసం దాదాపు మూడేళ్ల పాటు తన షెడ్యూల్ ఫ్రీజ్‌ చేసుకున్నాడు మహేష్ బాబు. అయితే లేటెస్ట్ టాక్ ప్రకారం తన పాత్ర షూటింగ్‌ను ఆగస్టు నెలలోపు పూర్తి చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

వారణాసి రిలీజ్ కోసం వెయిట్ చేయకుండా తన ఫ్యాన్స్‌ను ఆకట్టుకునేలా మరో ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకురావాలని మహేష్ ప్లాన్ చేస్తున్నారని అంటున్నారు. మైత్రి మూవీ మేకర్స్‌తో కలిసి ఒక పవర్‌ఫుల్ స్టోరీలైన్‌తో సినిమా చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నట్లు టాక్.

Kara First Review : ధనుష్ ‘కర’ సినిమా ఫస్ట్ రివ్యూ.. దొంగగా ధనుష్.. మళ్ళీ హిట్ కొడతాడా?

మైత్రి మేకర్స్‌తో మహేష్ కాంబినేషన్ కోసం ఫ్యాన్స్ ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. వారణాసి షెడ్యూల్ పూర్తయ్యాక ఇమీడియేట్‌గా ఈ కొత్త ప్రాజెక్ట్ లాంచ్ చేసి, వారణాసి రిలీజ్ వరకు గ్యాప్ లేకుండా హైప్ మెయింటైన్ చేయాలని మహేష్ టీమ్ స్ట్రాటజీస్‌ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

మహేష్‌ సినిమాకు డైరెక్టర్ ఎవరు, స్టోరీ ఏమిటనేది ఇంకా సీక్రెట్‌గా ఉంచినా, మైత్రి మేకర్స్‌ స్టైల్‌లో బిగ్ ఎంటర్‌టైనర్ అయ్యే అవకాశాలు ఉన్నాయని అంచనాలున్నాయి. అయితే వారణాసి మూవీ కోసం ఈగర్లీగా వెయిట్ చేస్తున్న మహేష్ ఫ్యాన్స్‌కు..లేటెస్ట్‌ అప్డేట్‌ సర్‌ప్రైజింగ్‌గా మారింది.