Varanasi Movie: మహేష్‌బాబు వారణాసి మూవీ రిలీజ్ పోస్ట్‌పోన్ కానుందా?
మహేష్ బాబు- రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ ఎపిక్ చిత్రం వారణాసి (Varanasi)మూవీ ఊహించని అడ్డంకులను ఎదుర్కొంటోంది
- Thota Vamshi Kumar
- Updated on- April 16, 2026 / 05:05 PM IST
Gossip Garage Mahesh Babu Varanasi Movie release may be postponed
- వారణాసి మూవీపై అమెరికా-ఇరాన్ మధ్య వార్ ఎఫెక్ట్
- మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో ప్లాన్ చేసిన షూటింగ్‌కు బ్రేక్
Varanasi Movie: మహేష్ బాబు- రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ ఎపిక్ చిత్రం వారణాసి మూవీ ఊహించని అడ్డంకులను ఎదుర్కొంటోంది. అమెరికా-ఇరాన్ మధ్య వార్ నేపథ్యంలో మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో ప్లాన్ చేసిన ఇంటర్నేషనల్ షూటింగ్ షెడ్యూల్ పూర్తిగా వాయిదా పడింది.
దీంతో కెన్యా, ఆఫ్రికా అడవుల్లో చేయాల్సిన కీలక సీన్ల షూటింగ్‌కు బ్రేకులు పడ్డాయట. ప్రస్తుతం హైదరాబాద్‌లోని శంషాబాద్, కొండాపూర్ అల్యూమినియం ఫ్యాక్టరీలతో పాటు జూనియర్ ఎన్టీఆర్ దేవర సెట్‌లో షూట్ చేస్తున్నారట. ఇంతకు ముందు అంటార్కిటికా, జార్జియా వంటి లొకేషన్లలో భారీ సన్నివేశాలు పూర్తి చేసినా, వార్ కారణంగా మిడిల్ ఈస్ట్ షూట్‌కు అడ్డంకులు ఏర్పడ్డట్లు టాక్.
*కేరళ నూతన సంవత్సరం వెలుగుల్లో అనన్య అందాల సందడి
అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తి అయ్యే పరిస్థితి కనిపించట్లేదట. దీంతో వారణాసి రిలీజ్‌ను వాయిదా వేసే అవకాశాలు ఉన్నాయన్న టాక్ వినిపిస్తోంది. మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం అనేక కీలక సన్నివేశాలు రియల్ లొకేషన్లలోనే చేయాలని రాజమౌళి భావిస్తున్నారు.
అయితే గ్లోబల్ సిచ్యువేషన్స్ సమసిపోకపోతే షూటింగ్ షెడ్యూల్ మరింత ఆలస్యం కావొచ్చని అంటున్నారు. ఇప్పటికే భారీ సెట్టింగ్స్, విజువల్ ఎఫెక్ట్స్‌పై రాజమౌళి టీమ్ దృష్టి పెట్టింది. రిలీజ్ పోస్ట్ పోన్‌పై అధికారిక ప్రకటన రాకపోయిన.. సోషల్ మీడియా ప్రచారం ఊహాగానాలకు తెరదీస్తుంది.
