Movie audience : లెన్త్ కాదు.. కంటెంట్‌ మ్యాటర్స్‌

డ్యూరేషన్‌తో సంబంధం లేకుండా కంటెంట్‌కు ఆడియన్స్ (Movie audience) ఫిదా అవుతున్నారు.

Gossip Garage movie audience mind set changed

movie audience : బాక్సాఫీస్ దగ్గర దురంధర్-2 మూవీ సునామీ సృష్టిస్తోంది. రికార్డు కలెక్షన్స్‌తో దూసుకెళ్తూ బాలీవుడ్‌కు ఓ భారీ సక్సెస్‌ను అందించింది. దాదాపు 4గంటల లెన్త్ ఉన్న దురంధర్-2 సినిమా ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తుంది. మామూలుగా అయితే ఓ సినిమా రెండున్నర గంటలు దాటితే సాగదీత అని, బోరింగ్‌ అని ఒపీనియన్స్ వ్యక్తం అవుతాయి. కానీ ధురంధర్‌-2 మాత్రం ఫుల్ పాజిటివ్‌ టాక్ తెచ్చుకుంది.

డ్యూరేషన్‌తో సంబంధం లేకుండా కంటెంట్‌కు ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. గతంలో బాహుబలి, పుష్ప 2 కూడా కంటెంట్ మ్యాటర్స్ అని ప్రూవ్ చేశాయి. కంటెంట్ బాగుంటే ఆడియన్స్ఎంత లెన్త్ అయినా సరే సీటు నుంచి కదలకుండా చూసేస్తున్నారు. మూడు గంటలు, మూడున్నర గంటలు కాకపోతే నాలుగు గంటల లెన్త్ ఉన్నా ఓకే కంటెంట్‌ ప్రేక్షకులను ఒప్పిస్తోంది. దీంతో మేకర్స్ ఆలోచన కూడా మారుతోందట.

Niharika Konidela : దివి నుంచి దిగి వ‌చ్చిన దేవ‌క‌న్య‌లా.. మెగా డాట‌ర్ నిహారిక క్యూట్ ఫోటోలు..

పెద్ద సినిమాలను పార్ట్ 1, పార్ట్ 2గా విడగొట్టి రిలీజ్ చేయడం కంటే ఇక నుంచి ఒక్కే పార్ట్‌లో డ్యూరేషన్‌తో సంబంధం లేకుండా థియేటర్లలోకి తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారట కొందరు మేకర్స్. షూటింగ్ జరుగుతున్న కొన్ని భారీ సినిమాలు పార్ట్-1, పార్ట్‌-2గా రిలీజ్ చేయాలని భావించినా, ప్రస్తుతం ఒకే పార్ట్‌గా విడుదల చేయాలని భావిస్తున్నారట. కంటెంట్ బాగుంటే లెన్త్ మ్యాటరే కాదని ప్రేక్షకులు నిరూపించారు కాబట్టి..ఈ మార్పు ఇంకా భారీ సినిమాలకు బూస్టప్‌ ఇస్తుందని అంటున్నారు. ఎక్కువ లెన్త్‌తో వచ్చే సినిమాలు ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకుంటాయో చూడాలి మరి.