Tollywood : థియేటర్లు ఖాళీ..! టికెట్ రేట్లే కారణమా?

టాలీవుడ్‌లో (Tollywood) పెద్ద సినిమా రిలీజ్ అంటే కంటెంట్ కంటే ముందుగా టికెట్ రేట్స్‌పై ఎక్కువ చర్చ జరుగుతోంది.

Gossip Garage Movie Ticket Price Hike Issue

Tollywood : టాలీవుడ్‌లో పెద్ద సినిమా రిలీజ్ అంటే కంటెంట్ కంటే ముందుగా టికెట్ రేట్స్‌పై ఎక్కువ చర్చ జరుగుతోంది. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు పెద్ద సినిమాలకు హైప్ క్రియేట్ చేసేందుకు ప్రభుత్వాల నుంచి ప్రత్యేక అనుమతులు తీసుకుని టికెట్ ధరలను పెంచడం కామన్ అయిపోయింది. ఇదే ఇప్పుడు ఇండస్ట్రీకి ఇబ్బందికరంగా మారిందనే టాక్ వినిపిస్తోంది.

మొదటి రెండు మూడు రోజుల కలెక్షన్స్ కోసం చేసే ఈ హైక్ పాలసీ, సినిమాకి పెద్ద మైనస్ అవుతోందట. ఫ్యామిలీ ఆడియన్స్, సాధారణ ప్రేక్షకులు థియేటర్లకు రావడానికి వెనుకడుగు వేస్తున్నారని అంటున్నారు. ఇటీవల విడుదలైన ఓ స్టార్ హీరో సినిమానే బిగ్ ఎగ్జాంపుల్‌గా చెబుతున్నారు. మంచి రివ్యూలు, పాజిటివ్ టాక్ ఉన్నప్పటికీ, బుకింగ్స్ మాత్రం ఆశించినట్లు లేకపోవడం షాక్‌కు గురి చేసిందట. రీజన్ ఏంటంటే అధిక టికెట్ ధరలే అని చర్చించుకుంటున్నారు.

*Suriya : హీరో సూర్య మరో బయోపిక్.. జై భీమ్ కాంబో!

ఫ్యాన్స్‌కే టికెట్ రేట్స్ భారంగా అనిపిస్తే, సాధారణ ప్రేక్షకుడు ఎలా థియేటర్‌కు వస్తాడన్న ప్రశ్న వినిపిస్తోంది. సినిమా కంటెంట్ బాగా లేకపోతే ప్రేక్షకులు ఇంట్రెస్ట్‌ చూపించకపోవచ్చు. కానీ పాజిటివ్‌ టాక్ ఉన్నా కూడా జనం థియేటర్లకు రాకపోవడానికి కారణం టికెట్ రేట్సే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు.

టికెట్ రేట్స్ హైక్ ఇలా కొనసాగితే టాలీవుడ్‌ సినిమాలకు రానురాను ఇంకా నష్టమేనన్న టాక్ వినిపిస్తోంది. మొదటి వీకెండ్ కలెక్షన్స్ కోసం చేసే ఈ అధిక ధరల వ్యూహం, లాంగ్ రన్‌లో సినిమాపై నెగెటివ్‌ ఎఫెక్ట్ చూపిస్తోందని అంటున్నారు. ఇకపై నిర్మాతలు కూడా టికెట్ రేట్స్ విషయంలో జాగ్రత్త పడకపోతే, థియేటర్ ఆడియన్స్‌ను కోల్పోయే ప్రమాదం ఉందని ఇండస్ట్రీలో చర్చ జోరుగా సాగుతోంది.