Nani : సుకుమార్ శిష్యుడితో నాని సినిమా!

ఇప్పటికే డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్‌ ఓదెలతో వరుస ప్రాజెక్టులు చేస్తున్నాడు హీరో నాని(Nani).

Gossip Garage Nani green signal to sukumar assistant

Nani : ఇప్పటికే డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్‌ ఓదెలతో వరుస ప్రాజెక్టులు చేస్తున్నాడు హీరో నాని. దసరా తర్వాత..ప్యారడైజ్ మూవీతో ఆడియన్స్‌ ముందుకు రాబోతున్నాడు. అయితే సుకుమార్ మరో శిష్యుడితో నాని కామెడీ రోల్‌ చేయబోతున్నట్లు టాలీవుడ్ సర్కిల్స్‌లో గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి.

సుకుమార్ దగ్గర అసిస్టెంట్‌గా పని చేసిన ఒక అసిస్టెంట్ డైరెక్టర్ తన మొదటి సినిమాకు నానిని హీరోగా ఎంచుకున్నట్లు, అందులో నాని పూర్తి కామెడీ రోల్‌లో కనిపించనున్నట్లు టాక్. సుకుమార్ స్టైల్‌లో యూనిక్ స్టోరీలైన్‌తో కూడిన ఈ ప్రాజెక్ట్‌లో నాని తన న్యాచురల్ కామిక్ టైమింగ్‌ను ఇంకా మరింత ఎత్తుకు తీసుకెళ్లే అవకాశం ఉందట. ఇప్పటికే సుకుమార్ శిష్యులు శ్రీకాంత్ ఓదెలా, బుచ్చిబాబు సానా వంటి సక్సెస్ ట్రాక్‌లో వెళ్తుండగా..ఈ కొత్త శిష్యుడి ప్రాజెక్ట్‌కు భారీ అండదండలు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Allu Arjun: Lokesh: అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమాపై క్లారిటీ ఇచ్చిన లోకేష్.. బన్నీ బర్త్ డే రోజున ఇంట్రెస్టింగ్ పోస్ట్

ఈ సినిమాలో నాని కామెడీ రోల్ ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకోవాలని దర్శకుడు ప్లాన్ చేస్తున్నాడట. సుకుమార్ మార్క్ స్క్రిప్ట్‌తో కలిపి డార్క్ కామెడీ ఎలిమెంట్స్ కూడా ఉండే అవకాశం ఉందంటున్నారు. సుకుమార్ తన శిష్యులకు మంచి సపోర్ట్ ఇస్తున్న నేపథ్యంలో ఈ ప్రాజెక్టుపై త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని టాక్. నాని వైవిధ్యమైన పాత్రలు చేస్తున్న సమయంలో ఈ కామెడీ రోల్ అతని ఫ్యాన్స్‌కు మరో సర్‌ప్రైజ్‌గా మారనుంది. ఇండస్ట్రీలో ప్రస్తుతం ఈ ప్రచారం ఆసక్తికర చర్చలకు దారితీస్తోంది.