NTR : ఎన్టీఆర్ డ్రాగన్ స్టోరీ మారిందా..? నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్!

జూనియర్ ఎన్టీఆర్ (NTR), డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న భారీ బడ్జెట్‌ మూవీ డ్రాగన్‌పై ఇంట్రెస్టింగ్‌ గాసిప్స్‌ చక్కర్లు కొడుతున్నాయి.

Gossip Garage NTR DRAGON STORY change

NTR : జూనియర్ ఎన్టీఆర్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న భారీ బడ్జెట్‌ మూవీ డ్రాగన్‌పై ఇంట్రెస్టింగ్‌ గాసిప్స్‌ చక్కర్లు కొడుతున్నాయి. ఈ సినిమా షూటింగ్ స్పీడ్‌గా కొనసాగుతోంది. కానీ స్క్రిప్ట్‌లో ఊహించని మార్పులు జరుగుతున్నాయని టాక్. కేజీఎఫ్‌, సలార్ లాంటి బ్లాక్‌బస్టర్లతో తనదైన ముద్ర వేసిన ప్రశాంత్ నీల్..ఈ పిక్చర్‌ను భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దాలని ప్లాన్ చేస్తున్నాడు.

అయితే ఎన్టీఆర్ నటించిన వార్ 2 సినిమా ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో స్ట్రాంగ్ కమ్‌ బ్యాక్ కోసం.. డ్రాగన్‌ను నెక్స్ట్‌ లెవల్‌లో తెరకెక్కిస్తున్నారట. ఎన్టీఆర్ కోసం స్క్రిప్ట్‌ని పూర్తిగా మార్చేశారని, ప్రశాంత్ నీల్ స్వయంగా కొత్త స్టోరీ డెవలప్ చేసి రీరైట్ చేశారని టాక్.

Nani : పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేస్తూ నాని వీడియో.. ఏపీలో స్వచ్ఛరథాలపై మాట్లాడిన న్యాచురల్ స్టార్..

ఒరిజినల్ స్టోరీలో సెంటిమెంటల్ ట్రాక్స్, ఫ్యామిలీ ఎమోషన్స్, రొమాంటిక్ ఎలిమెంట్స్ ఎన్టీఆర్ పాన్ ఇండియా మాస్ ఇమేజ్‌కి సరిపోవడం లేదని టీమ్ భావించిందట. ఇప్పుడు ఎన్టీఆర్‌ని రా ఆఫ్ యాక్షన్, పవర్‌ఫుల్ రివెంజ్ హీరోగా చూపించేలా భారీ యాక్షన్ బ్లాక్స్, ఇంటెన్స్ ఫైట్ సీక్వెన్స్‌లు, స్ట్రాంగ్ ఎమోషనల్ డ్రామా మిక్స్ చేసి ప్యూర్ మాస్ ఎంటర్‌టైనర్‌గా తీర్చిదిద్దుతున్నారని గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి.

వార్ 2 ఎన్టీఆర్ అనుకున్నంత హిట్ కాకపోవడంతో డ్రాగన్‌తో మళ్లీ పాన్ ఇండియా లెవల్‌లో సత్తా చాటాలని ప్లాన్ చేస్తున్నారట. ఈ స్టోరీలో చేంజెస్‌ వల్ల షూటింగ్ కొంతకాలం ఆలస్యం అయిందట. అయినా షార్ట్ గ్యాప్‌లోనే అంతా సెట్‌ చేసి మళ్లీ షూటింగ్ చేస్తున్నారని అంటున్నారు. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కూడా స్టార్ట్ చేశారట. 2027 జూన్‌లో డ్రాగన్‌ను థియేటర్లలోకి తీసుకురావాలని టార్గెట్‌గా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. వార్-2 తర్వాత ఎన్టీఆర్ ఇమేజ్‌ని మళ్లీ పీక్‌కి తీసుకెళ్లేందుకు కొత్త స్టోరీతో డ్రాగన్ రీవెంజ్ బాంబ్ అవుతుందని భారీ హైప్ నడుస్తోంది.