NTR : ఎన్టీఆర్, నీల్ సినిమాకు సలార్ లింక్.!?
ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ (NTR) ప్రాజెక్ట్‌పై నెక్స్ట్ లెవల్ హైప్ కొనసాగుతోంది.
- Thota Vamshi Kumar
- Published on- April 25, 2026 / 01:52 PM IST
Gossip Garage NTR MOVIE SALAR LINK
NTR : ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్‌పై నెక్స్ట్ లెవల్ హైప్ కొనసాగుతోంది. సలార్ మూవీతో జూ.ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న ప్రాజెక్ట్‌కు లింక్ ఉండబోతుందన్న టాక్ వినిపిస్తోంది. నీల్ తన సినిమాలను ఒకే యూనివర్స్‌గా ప్లాన్ చేస్తున్నాడనే వార్తలు వస్తున్నాయి.
సలార్‌లో చూపించిన ప్రపంచం నుంచి ఎన్టీఆర్ సినిమా కథ కొనసాగుతుందేమోనన్న చర్చ జోరుగా సాగుతోంది. ఇదే నిజమైతే, ఇది టాలీవుడ్‌లో మరో సినిమాటిక్ యూనివర్స్ ప్రారంభం అవుతుందనే అంచనాలు పెరుగుతున్నాయి.
Raghu Kunche: సింగర్ రఘు కుంచె కూతురు రాగ కుంచె సీమంతం వేడుక.. స్పెషల్ ఫోటోలు వైరల్
ప్రభాస్ పాత్ర ఎన్టీఆర్ సినిమాలో కూడా ఉండే అవకాశముందంటున్నారు. చిన్న కామియో అయినా, లేక కీలక పాత్రగా అయినా ప్రభాస్ ఎంట్రీ ఉంటే థియేటర్లలో ఫ్యాన్స్‌కు పండగే. ఇప్పటికే నీల్ స్టైల్, ఎన్టీఆర్ ఎనర్జీ కలిస్తే థియేటర్లు దద్దరిల్లిపోవడం ఖాయమనే ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి.
