Raghu Kunche: సింగర్ రఘు కుంచె కూతురు రాగ కుంచె సీమంతం వేడుక.. స్పెషల్ ఫోటోలు వైరల్
ప్రముఖ గాయకుడు, సంగీత దర్శకుడు రఘు కుంచె(Raghu Kunche) ఇంట్లో సందడి నెలకొంది. ఆయన కుమార్తె రాగ కుంచె సీమంతం (బేబీ షవర్) వేడుక కుటుంబ సభ్యుల మధ్య అత్యంత వేడుకగా జరిగింది. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను రాగ కుంచె సోషల్ మీడియాలో పంచుకుంటూ తన ఆనందాన్ని వ్యక్తపరిచారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతుండగా, అభిమానులు రాగకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.














