Peddi : ధురంధర్ బాటలో పెద్ది..?
ధురంధర్ ఫార్ములానే టాలీవుడ్‌లో కూడా అమలు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయనే టాక్ వినిపిస్తోంది. బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న పెద్ది (Peddi) సినిమాపై ఇదే చర్చ నడుస్తోంది
- Thota Vamshi Kumar
- Published On : March 22, 2026 / 09:33 PM IST
Gossip Garage PEDDI SEQUEL PLAN
Peddi : ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ధురంధర్-2 సక్సెస్ తర్వాత టాలీవుడ్‌లో ఒక కొత్త ట్రెండ్ మొదలైనట్టే కనిపిస్తోంది. సాధారణంగా సీక్వెల్స్ అంటే సంవత్సరాల గ్యాప్ తీసుకుని వస్తుంటాయి. కానీ ఆదిత్యధర్ మాత్రం ఈ కాన్సెప్ట్‌ను పూర్తిగా మార్చేశాడు. పార్ట్-1 విడుదలై ఇంకా హైప్ తగ్గకముందే, కేవలం మూడు నెలల్లో పార్ట్-2ను రిలీజ్ చేసి ఆడియన్స్ ఎమోషన్‌ను క్యారీ అయ్యేలా చూశాడు.
ఈ స్ట్రాటజీతో మూవీపై ఆసక్తి తగ్గకుండా ఉండటమే కాకుండా, మార్కెట్‌లో ఉన్న హైప్‌ను క్యాష్ చేసుకోవచ్చన్న ప్రూవ్ చేశాడు. ధురంధర్ పార్ట్-1, 2 రెండు కలిపి భారీగా కలెక్ట్ చేశాయని.. షార్ట్ టర్మ్ సీక్వెల్ ప్లానింగే యూత్ ఆడియన్స్‌ను థియేటర్స్‌కి మళ్లీ మళ్లీ రప్పిస్తుందని అంటున్నారు.
Manchu Lakhsmi Daughter : మంచు లక్ష్మీ కూతురు ఓణీల వేడుక.. సెలబ్రిటీలు ఎవరెవరు వచ్చారో చూశారా?
ధురంధర్ ఫార్ములానే టాలీవుడ్‌లో కూడా అమలు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయనే టాక్ వినిపిస్తోంది. బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న పెద్ది సినిమాపై ఇదే చర్చ నడుస్తోంది. ఈ సినిమా క్లైమాక్స్‌లోనే పార్ట్ 2కి లీడ్ ఇచ్చే విధంగా ఒక స్ట్రాంగ్ ట్విస్ట్ ప్లాన్ చేస్తున్నారనే గాసిప్ వినిపిస్తోంది. పార్ట్-1 రిలీజ్ అయ్యాక ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా, ఆరు నెలల్లోనే పార్ట్-2ను రిలీజ్ చేసేలా షూట్ ప్లానింగ్ జరుగుతోందట.
ఇలా పార్ట్‌లను ముందే డిజైన్ చేసి, ఒకేసారి లేదా బ్యాక్ టు బ్యాక్ షూట్ చేయడం ద్వారా టైమ్, బడ్జెట్ కంట్రోల్ చేయడమే కాకుండా, హైప్‌ను కొనసాగించే అవకాశం ఉంటుందని మేకర్స్ భావిస్తున్నారట. ఇది నిజమైతే.. టాలీవుడ్‌లో కూడా ఫాస్ట్ సీక్వెల్ మోడల్ ఒక కొత్త ట్రెండ్‌గా మారే అవకాశం ఉంది.
