Ram charan : శ్రీకృష్ణుడిగా రామ్‌చరణ్.!?

రీమేక్‌లో శ్రీకృష్ణుడి పాత్రను రామ్‌చరణ్‌తో (Ram charan) చేయించాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారనే టాక్ ఇప్పుడు ఆసక్తిని పెంచుతోంది.

Gossip Garage Ram charan To Play Lord Krishna Role In Upcoming Film

Ram charan : గుజరాత్ సినీ ఇండస్ట్రీలో సంచలన విజయం సాధించిన లాలో కృష్ణ సదా సహాయతే సినిమా ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. సాధారణ వ్యక్తి జీవితంలో శ్రీకృష్ణుడి దైవిక సాన్నిధ్యం, ఆధ్యాత్మిక ప్రయాణం చుట్టూ సాగే ఈ కథను తెలుగులో రీమేక్ చేయాలనే ఆలోచనలు జరుగుతున్నాయట.

చిన్న బడ్జెట్‌తో తెరకెక్కి భారీ విజయం సాధించిన ఈ సినిమా కథ తెలుగు ప్రేక్షకులకూ బాగా కనెక్ట్ అవుతుందని భావిస్తున్నారట. అయితే ఈ రీమేక్‌లో శ్రీకృష్ణుడి పాత్రను రామ్‌చరణ్‌తో చేయించాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారనే టాక్ ఇప్పుడు ఆసక్తిని పెంచుతోంది. చరణ్‌కు ఉన్న పాన్ ఇండియా ఇమేజ్‌తో పాటు, ఆధ్యాత్మికత, భావోద్వేగం ఉన్న పాత్రలో ఆయన కనిపిస్తే చాలా ప్రత్యేకంగా ఉంటుందని భావిస్తున్నారట. ఈ పాత్ర పూర్తిస్థాయిలో ఉంటుందా.? లేక కీలకమైన గెస్ట్ అప్పియరెన్స్‌గా ఉంటుందా.? అనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్‌గా ఉంది.

Shiva Jyothi : పింక్ శారీ, భారీ హారంతో యాంక‌ర్ శివ‌జ్యోతి.. ఫోటోలు వైర‌ల్‌..

లాలో కృష్ణ సదా సహాయతే సినిమా రీమేక్‌..ప్రాజెక్ట్‌కు దర్శకుడిగా కార్తిక్ సుబ్బరాజ్ పేరు కూడా వినిపిస్తుండటం మరో ఆసక్తికర అంశం. ఒరిజినల్ కథలోని ఆధ్యాత్మిక భావాన్ని అలాగే ఉంచుతూ, తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా భారీ స్థాయిలో తెరకెక్కించే ఆలోచనలో ఉన్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

అయితే రీమేక్ మూవీ కీరోల్ ప్లే చేసేదెవరు.? ఎవరి డైరెక్షన్‌లో ప్లాన్ జరుగుతోంది.? ఏ ప్రొడక్షన్ హౌస్ రిస్క్ తీసుకునేందుకు ముందుకొస్తుందనే దానిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. కానీ శ్రీకృష్ణుడిగా రామ్‌చరణ్ అనే టాక్ మాత్రం మెగా అభిమానుల్లో భారీ అంచనాలు పెంచేస్తోంది.