Samantha-Raj : సమంత, రాజ్.. హాలీవుడ్ ప్రాజెక్టు.!?

సమంత లీడ్ రోల్‌లో రాజ్ అండ్ డీకే నిర్మించిన (Samantha-Raj) మా ఇంటి బంగారం మూవీ సక్సెస్ టాక్‌తో దూసుకెళ్తుంది.

Gossip Garage Samantha and Raj Nidimoru Hollywood project

Samantha-Raj : సమంత లీడ్ రోల్‌లో..రాజ్ అండ్ డీకే నిర్మించిన మా ఇంటి బంగారం మూవీ సక్సెస్ టాక్‌తో దూసుకెళ్తుంది. అప్పుడే రాజ్ నిడిమోరు, సమంత నెక్స్ట్ ప్రాజెక్టుపై ఊహాగానాలు మొదలయ్యాయి. సమంత దంపతులు హాలీవుడ్ ప్రాజెక్ట్ చేయబోతున్నారని టాక్ మొదలైంది.

సమంత కీరోల్‌లో నటించిన మా ఇంటి బంగారం సినిమాకు రాజ్ నిడిమోరు కథను అందించి సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ విజయం సమంత దంపతుల కెరీర్‌లో కొత్త చాప్టర్‌ను స్టార్ చేసిందని, వారు గ్లోబల్ లెవెల్ ప్రాజెక్టులపై ఫోకస్ పెడుతున్నారని చెబుతున్నారు. రాజ్ ఇంటర్నేషనల్‌ లెవల్‌ కంటెంట్‌తో.. తన ట్యాలెంట్‌ ఏంటో ఇప్పటికే చూపించాడు. సమంత కూడా గ్లోబల్ ఆడియన్స్‌ను ఆకట్టుకునే యాక్టింగ్ స్కిల్స్ ఉన్న నటి.

Ananya Nagalla : అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వం.. స్పెష‌ల్ ఫోటోలు షేర్ చేసిన తెలుగు న‌టి అన‌న్య నాగ‌ళ్ల‌

ఈ దంపతుల కాంబినేషన్ హాలీవుడ్ ప్రాజెక్టు చేస్తే అదుర్స్ అనే ఎక్స్‌పెక్టేషన్స్ మొదలయ్యాయి. రాజ్‌కు హాలీవుడ్‌తో ఇప్పటికే బలమైన అనుబంధం ఉంది. గ్లోబల్ స్పై యూనివర్స్ సిరీస్ సిటాడెల్ షూటింగ్‌ నుంచే ఆయన హాలీవుడ్ ఎంట్రీపై చర్చలు జరుగుతున్నాయట.

సమంత, రాజ్‌ నెక్స్ట్ ప్రాజెక్టు హాలీవుడ్ స్కేల్‌లో ఉండబోతుందని, దీనికి రాజ్ నిడిమోరు డైరెక్టర్‌గా..సమంత ఒక ముఖ్య నిర్మాతగా ఉండబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. రాజ్‌కు ఇంటర్నేషనల్ ప్రాజెక్టులను డీల్ చేసిన ఎక్స్‌పీరియన్స్ ఉంది. సమంత కూడా ప్రొడక్షన్ హౌస్ నడుపుతోంది. ఓవైపు యాక్టింగ్ స్కిల్స్‌, మరోవైపు ప్రొడక్షన్‌పై పట్టుండటంతో..ఈ కాంబినేషన్‌పై ఎగ్జైట్‌మెంట్ పెరిగిపోతోంది.

సమంత, రాజ్‌ నిడిమోరు చేయబోయే ఈ హాలీవుడ్ ప్రాజెక్టు వివరాలు, కాస్టింగ్, షూటింగ్ షెడ్యూల్ వంటి అప్‌డేట్స్ త్వరలోనే అధికారికంగా ప్రకటించబోతున్నారట. వీరు తెరకెక్కించబోయే హాలీవుడ్ సినిమా ఎలా ఉండబోతోంది? ఇది కేవలం వెస్ట్రన్ సినిమాగానే ఉంటుందా..లేక టాలీవుడ్, హాలీవుడ్ స్టార్లతో తెరకెక్కే మల్టీస్టారర్ కాబోతోందా.? అనే ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.