Sukumar : సుక్కు రైటింగ్స్.. బన్నీవాసు ప్లానింగ్ .!

యువ నిర్మాత బన్నీవాసు, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలిసి ఓ ఆసక్తికరమైన ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది.

Gossip Garage Sukkus writing Bunny Vasus planning

Sukumar : టాలీవుడ్‌లో మరో ఇంట్రెస్టింగ్ కాంబో అంటూ ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. యువ నిర్మాత బన్నీవాసు, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలిసి ఓ ఆసక్తికరమైన ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఇందులో ప్రధాన పాత్ర కోసం టాలెంటెడ్ నటుడు ప్రియదర్శి పేరు బలంగా వినిపించడం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇప్పటివరకు కంటెంట్ బేస్డ్ సినిమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రియదర్శి, ఈ ప్రాజెక్ట్‌తో మరో లెవెల్‌కు వెళ్లే అవకాశాలు ఉందంటున్నారు.

ఈ సినిమా బన్నీ వాసు వర్క్స్ , సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై నిర్మాణం కానుందని సమాచారం. సుకుమార్ స్టైల్‌లో డిఫరెంట్ కాన్సెప్ట్, రియలిస్టిక్ ట్రీట్మెంట్‌తో కూడిన డార్క్ డ్రామా లేదా థ్రిల్లర్‌గా ఈ పిక్చర్‌ ఉండబోతుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు దర్శకత్వం ఎవరు వహిస్తారనేది ఇంకా క్లారిటీ లేదు. స్వయంగా సుకుమార్ డైరెక్ట్ చేస్తారా.? లేక ఆయన టీమ్ నుంచి కొత్త డైరెక్టర్‌ను పరిచయం చేస్తారా.? అన్నది ఆసక్తిగా మారింది. అయితే స్క్రిప్ట్, క్రియేటివ్ సూపర్ విజన్ మాత్రం సుకుమార్ చేతుల్లోనే ఉండనున్నట్లు టాక్. టాప్ టెక్నీషియన్స్‌ను ఎంపిక చేసే పనిలో టీమ్ ఉన్నట్లు టాక్.

Kotha Malupu Review : ‘కొత్త మలుపు’ రివ్యూ.. సింగర్ సునీత కొడుకు హీరోగా చేసిన సినిమా ఎలా ఉందంటే..

ఈ సినిమాలో హీరోయిన్‌గా కొత్త ఫేస్‌ను తీసుకునే ఆలోచన చేస్తున్నారట. సపోర్టింగ్ క్యాస్ట్ కూడా స్ట్రాంగ్‌గా ఉండేలా ప్లాన్ చేస్తున్నారట. పుష్ప-2 బ్లాక్‌బస్టర్ తర్వాత సుకుమార్ ప్రస్తుతం రామ్‌చరణ్‌తో తన నెక్స్ట్ ప్రాజెక్టు కోసం రెడీ అవతున్నాడు. అలాంటి సమయంలో ఈ కొత్త ప్రాజెక్ట్ ప్లాన్ చేయడం ఇండస్ట్రీలో చర్చనీయాంశం అవుతోంది.

అధికారిక ప్రకటన ఇంకా రాకపోయినా ఈ కాంబినేషన్ నిజమైతే టాలీవుడ్‌లో ఇది ఒక క్రేజీ ప్రాజెక్ట్‌గా నిలవడం ఖాయం అంటున్నారు. బన్నీ వాసు, ప్రియదర్శి కాంబినేషన్‌లో గతంలో మిత్రమండలి అనే సినిమా చేశారు. మంచి అంచనాల మధ్య రిలీజైన ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఆశించినంత స‌క్సెస్‌ అందుకోలేదు. దీంతో ఇప్పుడు ప్రియదర్శితో చేయబోతున్న కొత్త సినిమా విషయంలో బన్నీ వాసు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ఆడియన్స్‌కు నచ్చేలా స్టోరీ డెవ‌ల‌ప్‌మెంట్ నుంచి ఫైనల్ అవుట్‌పుట్ వరకు ప్రతి అంశాన్ని దగ్గరుండి పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తోంది.