Tollywood : టాలీవుడ్‌కు సెన్సార్ టెన్షన్.!
సెన్సార్ సెగ (Tollywood) టాలీవుడ్‌కు పెద్ద తలనొప్పిగా మారిందనే టాక్ గట్టిగా వినిపిస్తోంది.
- Thota Vamshi Kumar
- Published on- July 5, 2026 / 10:44 AM IST
Gossip Garrage Tollywood Sensor Kastalu
Tollywood : సెన్సార్ సెగ.. టాలీవుడ్‌కు పెద్ద తలనొప్పిగా మారిందనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. చిన్న చిన్న డైలాగ్స్, టైటిల్స్, సీన్లపై కూడా సెన్సార్ బోర్డు అబ్జక్షన్స్ చేస్తుండటంతో నిర్మాతలు రిలీజ్ డేట్స్ ఫిక్స్ చేయడానికే భయపడిపోతున్నారట. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న కొన్ని సినిమాలు కూడా సెన్సార్ సర్టిఫికెట్ కోసం ఎదురుచూస్తూ విడుదల చేయకుండా నిలిచిపోయాయని సమాచారం.
ఇదే పరిస్థితి కోలీవుఢ్, బాలీవుడ్, మాలీవుడ్‌లో కూడా ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. కంటెంట్ విషయంలో నిబంధనలు కఠినతరం కావడంతో, దర్శకులు కూడా తమ క్రియేటివిటీని తగ్గించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
Regena : నీలిరంగు డ్రెస్‌లో రెజీనా కసాండ్రా.. ఫోటోలు వైరల్..
సెన్సార్ రూల్స్‌తో పెద్ద సినిమాలే ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయట. తమిళ్‌లో జననాయకన్, బాలీవుడ్‌లో సల్మాన్ ఖాన్ నటించిన మాతృభూమి సినిమాల రిలీజ్ డేట్స్ కూడా సెన్సార్ క్లియరెన్స్ మీదే ఆధారపడి ఉన్నాయట. ఒకప్పుడు ప్రమోషన్స్, థియేటర్స్ లెక్కలు చూసుకునే నిర్మాతలు, ఇప్పుడు సెన్సార్ ఎప్పుడు పూర్తి అవుతుందోనని ఉత్కంఠగా ఎదురుచూసే పరిస్థితి ఉందట. ఇది ఇలాగే కొనసాగితే.. రాబోయే పెద్ద సినిమాల రిలీజ్ షెడ్యూల్స్ గందరగోళంలో పడుతాయనే టెన్షన్ టాలీవుడ్‌లో ఎక్కువగా కనిపిస్తోంది. సెన్సార్ నిబంధనల్లో కొన్ని మార్పులు చేయాలనే డిమాండ్స్ వస్తున్నాయి.
