Gundeboina jhansi : బిగ్ బాస్ తెలుగు సీజన్ 10.. ఎంట్రీ ఇచ్చిన మూడవ కంటెస్టెంట్.. అగ్నిపరీక్ష నుంచి వచ్చిన ఝాన్సీ..

Gundeboina jhansi

  • Updated on- September 6, 2026 / 07:58 PM IST

Gundeboina jhansi

Gundeboina jhansi : బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 నేటి నుంచే గ్రాండ్ గా ఆరంభమయింది. నేడు సెప్టెంబర్ 6న గ్రాండ్ లాంచ్ ఈవెంట్ తో నాగార్జున హోస్ట్ గా ఒక్కో కంటెస్టెంట్ ని పిలిచి, వాళ్ళ గురించి పరిచయం చేసి బిగ్ బాస్ హౌస్ లోకి పంపిస్తున్నారు. మొదటి కంటెస్టెంట్ గా బెంగాలీ నటి దేబ్జానీ మోదక్ వచ్చింది. రెండవ కంటెస్టెంట్ గా హీరో త్రిగుణ్ ఎంట్రీ ఇచ్చాడు. మూడవ కంటెస్టెంట్ గా అగ్నిపరీక్ష నుంచి వచ్చిన ఝాన్సీ ఎంట్రీ ఇచ్చింది.

ఝాన్సీ ఒక ఫోక్ సింగర్. సూర్యాపేట రైతు కుటుంబం నుంచి వచ్చింది. అగ్నిపరీక్షకు అప్లై చేసి అందులో అన్ని టాస్కులను గెలిచి గోల్డెన్ టికెట్ గెలిచి బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. స్టేజిపైకి వచ్చిన ఝాన్సీ ఒక సాంగ్ పాడి నాగార్జునకు వినిపించింది. బిగ్ బాస్ ద్వారా సింగర్ గా అవకాశాలు రావాలని కోరుకుంటున్నట్టు తెలిపింది.

Also Read : Thrigun : బిగ్ బాస్ తెలుగు సీజన్ 10.. ఎంట్రీ ఇచ్చిన రెండవ కంటెస్టెంట్.. హీరో త్రిగుణ్.. హీరోగా సినిమాలు చేసి..