ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సభ్యుల సంక్షేమం కోసం ‘ఉల్లాల ఉల్లాల’ నిర్మాత గురురాజ్, ‘తిప్పరామీసం’ నిర్మాతలు విరాళమందించారు..
ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ సభ్యుల సంక్షేమం కోసం నిర్మాతలు ముందుకొచ్చారు. ‘ఉల్లాల ఉల్లాల’ నిర్మాత గురురాజ్, ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్‌కు ‘సైరా’ దర్శకుడు సురేదర్‌రెడ్డి చేతుల మీదుగా లక్ష రూపాయలు ఇచ్చారు. అలాగే ‘తిప్పరామీసం’ హీరో శ్రీవిష్ణు సమక్షంలో ఆ చిత్ర నిర్మాతలు రిజ్వాన్, అచ్యుత్ రూ. 2 లక్షల సాయం అందచేశారు.
అసోసియేషన్ సభ్యుల యొక్క హెల్త్ కార్డ్స్, గోల్డెన్ జూబ్లీ వేడుకలు, ఇతర సంక్షేమ కార్యక్రమాల కోసం కమిటీ కృషి చేస్తోందని, అందుకు దాతలు చేసే సాయం మరింత తోడ్పాటును అందిస్తుందని ఫిలింక్రిటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సురేష్ కొండేటి తెలిపారు. తమ అసోసియేషన్ సంక్షేమం కోసం ముందుకొచ్చిన నిర్మాతలకు, ఇతర దాతలకు ధన్యవాదాలు తెలిపారు.
Read Also : గుమ్మడికాయ కొట్టేశారు.. ‘90 ఎంఎల్’ షూటింగ్ పూర్తి
ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఇ.జనార్థన్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ వాసు, ట్రెజరర్ భూషణ్ తదితరులు పాల్గొన్నారు. అసోసియేషన్ సభ్యులంతా ఇటీవల మెగాస్టార్ చిరంజీవిని కలిసిన విషయం తెలిసిందే.