Hansika Motwani : బ్యాచిలర్ పార్టీలో రచ్చ చేస్తున్న హన్సిక..
యాపిల్ బ్యూటీ హన్సిక.. తన కాబోయే వరుడిని పరిచయం చేస్తూ, తాను పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక చివరిగా తన బ్యాచిలర్ లైఫ్ ని ఫ్రెండ్స్ తో కలిసి విదేశాల్లో ఎంజాయ్ చేస్తుంది ఈ యాపిల్ బ్యూటీ.
- gum 95921
- Published On : November 27, 2022 / 09:36 PM IST
Hansika Motwani Bachelor Party
Hansika Motwani : యాపిల్ బ్యూటీ హన్సిక.. తన కాబోయే వరుడిని పరిచయం చేస్తూ, తాను పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. తన బిజినెస్ పార్టనర్‌నే లైఫ్ పార్టనర్‌గా మార్చుకుంది హన్సిక. ప్రముఖ వ్యాపారవేత్త అయిన సోహైల్ కతురియాతో హన్సిక ఎంగేజ్మెంట్ ప్యారిస్ లో ఈఫిల్ టవర్ దగ్గర ఘనంగా జరిగింది.
Hansika Marriage : పెళ్లి పనులు మొదలుపెట్టిన హన్సిక..
ఇక చివరిగా తన బ్యాచిలర్ లైఫ్ ని ఫ్రెండ్స్ తో కలిసి విదేశాల్లో ఎంజాయ్ చేస్తుంది ఈ యాపిల్ బ్యూటీ. స్నేహితులతో కలిసి గ్రీస్ విధుల్లో సందడి చేస్తుంది. హోటల్ రూమ్ లో డాన్స్ లు వేస్తూ రచ్చ రచ్చ చేస్తుంది. బెస్ట్ బ్యాచిలర్ పార్టీ అంటూ.. అందుకు సంబంధించిన వీడియోని తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది.
కాగా ఈ జంట డిసెంబర్ 4న ఒకటి కాబోతున్నారు. ఈ పెళ్లి వేడుకకు రాజస్థాన్ జైపూర్‌లోని ముండోటా ప్యాలెస్ వేదిక కానుంది. డెస్టినేషన్ వెడ్డింగ్ అవ్వడంతో, డిసెంబర్ 2 నుంచే ప్యాలెస్ లో పెళ్లి సందడి మొదలుకానుంది. ఇందుకు సంబంధించిన పనులు కొన్ని వారాల క్రిందటి నుంచే మొదలయ్యాయి. ముఖ్యమైన అతిధులు మాత్రమే ఈ వేడుకకు హాజరుకానున్నారు.
