Hansika Marriage : పెళ్లి పనులు మొదలుపెట్టిన హన్సిక..
తాజాగా హన్సిక పెళ్లిపనులు మొదలయ్యాయి. మంగళవారం సాయంత్రం ముంబయిలోని హన్సిక ఇంట్లో ‘మాతా కీ చౌకీ’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో ఇరు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. కాబోయే వధూవరులిద్దరూ..............

Hansika Marriage works started
Hansika Marriage : యాపిల్ బ్యూటీ హన్సిక ఇటీవలే తాను పెళ్లి చేసుకోబోతున్నాను అని తను చేసుకోబోయే వరుడ్ని అందరికి పరిచయం చేసింది. ఈఫిల్ టవర్ వద్ద తన బాయ్ ఫ్రెండ్ సోహెల్ ప్రపోజ్ చేసిన ఫోటోలని తన సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంది హన్సిక. దీంతో అభిమానులు, పలువురు ప్రముఖులు హన్సికకి శుభాకాంక్షలు తెలిపారు.
తాజాగా హన్సిక పెళ్లిపనులు మొదలయ్యాయి. మంగళవారం సాయంత్రం ముంబయిలోని హన్సిక ఇంట్లో ‘మాతా కీ చౌకీ’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో ఇరు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. కాబోయే వధూవరులిద్దరూ ఈ కార్యక్రమంలో దుర్గాదేవి పూజలో పాల్గొన్నారు. ఈ వేడుకలో ఇద్దరూ రెడ్ కలర్ దుస్తుల్లో మెరిశారు. ఈ కార్యక్రమంతో ఇరు కుటుంబాల్లో పెళ్లి పనులు మొదలయ్యాయి.
Amritha Aaiyer : పసుపు చీరలో బంగారు వర్ణంలా మెరిసిపోతున్న అమృతా అయ్యర్
దీనికి సంబంధించిన రెండు ఫోటోలు బయటకి రావడంతో ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. డిసెంబర్ 4న వీరి వివాహం రాజస్థాన్ లో జరగనున్నట్టు సమాచారం.